'Sarileru Neekevvaru' క్లైమాక్స్‌పై మహేష్ బాబు అసంతృప్తి.. డైరెక్టర్‌కి చెప్పడంతో ఆయన రియాక్షన్

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సరిగ్గా ఈ తరుణంలో ఈ సినిమా క్లైమాక్స్‌పై డైరెక్టర్ అనిల్ రావిపూడి వద్ద తన అసంతృప్తి వ్యక్తం చేశారట మహేష్ బాబు. ఈ పరిస్థితుల్లో ఆ డైరెక్టర్ ఎలా రియాక్ట్ అయ్యాడు? వివరాల్లోకి పోతే..

 హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్

హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్

ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. ఇదే ఈ సినిమాకు చివరి షెడ్యూల్. ఇందులో విజయశాంతి, మహేష్ బాబులపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ మొదటివారంలో కంప్లీట్ కానుందని సమాచారం. ఇక ఆ వెంటనే సినిమా ప్రమోషన్స్‌కి బూస్టింగ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

మహేష్ బాబు అసంతృప్తి.. డైరెక్టర్‌ రియాక్షన్

మహేష్ బాబు అసంతృప్తి.. డైరెక్టర్‌ రియాక్షన్

సరిగ్గా ఈ తరుణంలో మహేష్ బాబు అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా క్లైమాక్స్‌ కోసం చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు మహేష్ బాబుకు ఏ మాత్రం నచ్చలేదట. దీంతో ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ దృష్టికి తీసుకొచ్చారట మహేష్. దీంతో వెంటనే క్లైమాక్స్‌ సన్నివేశాలను రీ షూట్ చేద్దామని అనిల్ చెప్పినట్లుగా తెలుస్తోంది.

అనిల్ రావిపూడి స్పెషల్ కేర్.. కలర్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్

అనిల్ రావిపూడి స్పెషల్ కేర్.. కలర్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్

మహేష్ బాబు కెరీర్‌లో 26వ చిత్రంగా రూపొందుతున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమాలో క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌ పోషిస్తోంది. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచేలా కమర్షియల్ హంగులతో కలర్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు అనిల్ రావిపూడి.

మహేష్ బాబు రోల్.. వెరీ ఇంట్రెస్టింగ్

మహేష్ బాబు రోల్.. వెరీ ఇంట్రెస్టింగ్

`స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు మహేష్ బాబు. ఇప్పటికే ఈయనకు సంబంధించిన లుక్స్, లిరికల్ సాంగ్స్ విడుదల చేసి మహేష్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మేకర్స్.

Recommended Video

CineBox: Chiranjeevi Imitates Pawan Kalyan | Ali Reza To Act In a Crazy Movie
 ఆడియన్స్‌ని థ్రిల్ చేసేలా మహేష్ హంగామా

ఆడియన్స్‌ని థ్రిల్ చేసేలా మహేష్ హంగామా

ఇక `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రాన్ని 2 గంటల 30 నిమిషాల నిడివి ఉండేలా ప్లాన్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుగు ఆడియన్స్‌ని థ్రిల్ చేసేలా ఆయన రూపొందించిన కొన్ని సన్నివేశాలు గతంలో ఎన్నడూ చుడని విధంగా ఉండనున్నాయట. చూడాలి మరి ఈ సంక్రాంతికి మహేష్ హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X