SSMB28: మహేష్ సినిమా కోసం KGF మాస్టర్స్.. త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా ప్లాన్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తరువాత సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల కథనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులను కాస్త కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాతోనే త్రివిక్రమ్ మహేష్ బాబును ఫ్యాన్ ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే గట్టిగానే వస్తుంది. అందుకోసం అందుకోసం ఒక డీల్ పై చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా కేజిఎఫ్ టెక్నీషియన్స్ ను కూడా ఈ సినిమా కోసం వాడబోతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహేష్ రెడీ
సర్కారు వారి పాట సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు ఎలాగైనా తన తదుపరి సినిమాను కూడా వీలైనంత తొందరగా మొదలు పెట్టాలని అనుకున్నాడు. కానీ త్రివిక్రమ్ స్క్రిప్ట్ విషయంలో పూర్తిస్థాయిలో మెప్పించకపోవడంతో కాస్త ఆలస్యమైంది ఇక మొత్తానికి ఇటీవల ఫైనల్ ఫుల్ స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ బాబు షూటింగ్ స్టార్ట్ చేసేందుకు కూడా రెడీ అవుతున్నాడు.

KGF మాస్టర్స్
అయితే ఈ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్ బెస్ట్ టెక్నీషియన్స్ ను తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా KGF సినిమా యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ట్విన్స్ అన్బరివ్ లని సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదివరకే దర్శకుడు త్రివిక్రమ్ వారితో కలిసి ఒకసారి చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక త్వరలోనే అగ్రిమెంట్ తో టెక్నీషియన్స్ ను ఫిక్స్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

మహేష్ కోసం
అన్బరివ్ కన్నడ సినిమాలకు చాలావరకు అద్భుతమైన ఫైట్ సీన్స్ ను క్రియేట్ చేసి హీరోల ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. KGF రెండు భాగాల్లో ప్రతి ఫైట్ కూడా వారి క్రియేటివిటీని బయటపెట్టింది. ఇక ఇటీవల వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ సినిమాకు కూడా వారే యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రాఫర్స్ గా వర్క్ చేశారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు కోసం కూడా వర్క్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎప్పటి నుంచో వాళ్ళు మహేష్ తో వర్క్ చేయాలని ఆశపడుతున్నట్లు సమాచారం.

హిందీ నుంచి ఆఫర్స్
అయితే మహేష్ బాబు 28వ సినిమాను నిర్మాత చిన బాబు ఫ్యాన్ ఇండియా సినిమాగా తీసుకురావాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా స్క్రిప్టును అదే రేంజ్ లో డెవలప్ చేసినట్లు టాక్. అయితే ఈ తరహా నిర్ణయం తీసుకోవడానికి ఒక ముఖ్య కారణం కూడా ఉందట. సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకముందే హిందీ నుంచి మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయట. అలాగే ఓవర్సీస్ లో కూడా దాదాపు 22 కోట్లకు పైగానే ఆఫర్లు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.

మహేష్ సంతృప్తిగా లేడా?
దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మహేష్ బాబు సినిమాను తెరపైకి తీసుకురావాలని కోరుకుంటున్నాడు. కానీ మహేష్ బాబు మాత్రం ఈ విషయంలో అంతగా సంతృప్తిగా లేడు అని తెలుస్తోంది. ఫ్యాన్ ఇండియా సినిమా అంటే అది రాజమౌళితోనే సాధ్యమవుతుంది అని కేవలం స్క్రిప్టు మాత్రమే కాదు దానికి తగ్గట్టు ప్రణాళిక ప్రమోషన్స్ కూడా చేయాలి కాబట్టి ముందే రిస్క్ తీసుకోవద్దు అని కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగు తదుపరి సినిమాను రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నారు కాబట్టి ఆ సినిమా ద్వారా పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తే బెస్ట్ అని మహేష్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











