మహేష్ బాబు కొత్త వ్యాపారం.. డబ్బు విషయంలో కఠినంగా ఉంటాడట..
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆదాయాన్ని పెంచుకోవడంలో చాలా తెలివిగా అడుగులు వేస్తుంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాల కంటే యాడ్స్ ద్వారానే ఈ స్టార్ హీరో ఎక్కువ ఆదాయాన్ని అందుకుంటాడు. ఇక ఈ బిజినెస్ మెన్ సినిమాలలో కూడా ఒక వ్యాపారవేత్తగా కనిపిస్తే ఆ సినిమా సగం హిట్టయినట్లే అనే సెంటిమెంట్ ఉంది.
ఇక సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు ఒక వడ్డీ వ్యాపారిగా కనిపించనున్నాడు అనే టాక్ వస్తోంది. ఆయన పాత్ర డబ్బు విషయంలో చాలా కటినంగా ఉంటుందని కథనలు కూడా వెలువడుతున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. ఇక సినిమా బ్యాంకింగ్ మోసాల చుట్టూ తిరుగుతుందని మొదటి నుంచి కొన్ని రూమర్స్ వస్తున్నాయి.

ఇక ఇప్పుడు మహేష్ అప్పులిచ్చే క్యారెక్టర్ లో సరికొత్తగా అలరించబన్నట్లు సమాచారం. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియదు గాని మహేష్ బాబు పాత్ర మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట.
ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమాలో కామెడీ సీన్స్ తో కడుపుబ్బా నవ్విస్తాడాని సమాచారం. ఇక సెకండ్ హాఫ్ లో సినిమా నేషనల్ వైడ్ బ్యాంక్ కుంభకోణాల చుట్టూ తిరుగుతుందట. ఈ సినిమా రెగ్యులర్ షుటింగ్ ని మరికొన్ని రోజుల్లో మొదలిపెట్టాలని చూస్తున్నారు. ఇక వచ్చే ఏడాది ఎలాగైనా సర్కారు వారి పాట సినిమాను రిలీజ్ చేయాలని మహేష్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











