మళ్ళీ మొదటికొచ్చిన మహేష్ బాబు.. పరశురామ్ కథలో మార్పులు జరగాల్సిందే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు అంటూ మరో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాతో మహేష్ తన మార్కెట్ స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఇక తదుపరి సినిమాలతో కూడా మరిన్ని విజయాలు అందుకోవాలని సూపర్ స్టార్ సిద్ధమవుతున్నాడు.
అసలు విషయంలోకి వస్తే.. మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాను గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తవ్వగా మహేష్ మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నారట. సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ కోసం మరోక వెర్షన్స్ రాయమని చెప్పారట. దీంతో దర్శకుడు మహేష్ బాబుకి నచ్చినట్లుగా కథలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అదే విధంగా మొదటి నుంచి ఈ సినిమా యూఎస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా అమెరికాలో ఇప్పట్లో ఎవరు కూడా కాలు పెట్టలేని పరిస్థితి. అందుకే షెడ్యూల్స్ ని కూడా క్యాన్సిల్ చేశారట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ని కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. లాక్ డౌన్ అనంతరం వీలైనంత త్వరగా సినిమాని సెట్స్ పైకి తేవాలని మహేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











