SSMB 28 కోసం మహేష్ బాబుతో త్రివిక్రమ్ అలాంటి ప్రయోగం.. అందుకే ఆ స్టార్స్?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను మహేష్ బాబు తో చేయబోతున్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తర్వాత గత ఐదేళ్లుగా వీరి కలయికలో ఓ సినిమా రాబోతుంది అని అని అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక మొత్తానికి ఈ ఏడాది వీరి కలయికలో మూడవ సినిమా స్టార్ట్ కాబోతోంది. ఇక వచ్చే ఏడాది సినిమా ఊహించిన విధంగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్రివిక్రమ్ అందుకోసం మిగతా ఇండస్ట్రీలోని నటీనటులను సినిమాలో భాగం చేయబోతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్

ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్

అల వైకుంఠపురములో సినిమా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. కానీ అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో మళ్లీ మహేష్ వైపు యూటర్న్ తీసుకున్నాడు. ఇక మహేష్ బాబుతో త్రివిక్రమ్ ఒక డిఫరెంట్ ఫ్యామిలీ యాక్షన్ సినిమాను తెరపైకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

 లుక్ విషయంలో..

లుక్ విషయంలో..

మహేష్ బాబు ఇంత వరకు ఎప్పుడు చేయని ఒక యాక్షన్ పాత్రను SSMB28 సినిమాలో హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. లుక్ విషయంలో కూడా జాగ్రత్తలు టీబీసుకొని ఈసారి సూపర్ స్టార్ చాలా డిఫరెంట్ యాంగిల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

హిందీలో తప్పితే..

హిందీలో తప్పితే..

ప్రస్తుతం అగ్ర దర్శకులు స్టార్ హీరోలు అందరూ కూడా ఫ్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ మహేష్ త్రివిక్రమ్ ఇంకా అటువైపు అడుగులు వేయలేదు. హిందీ లో తప్పితే మిగతా సౌత్ ఇండస్ట్రీలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

అందుకే ఆ నటులు

అందుకే ఆ నటులు

తెలుగులోనే కాకుండా మలయాళం తమిళ్ కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదల అవుతుంది కాబట్టి ఇండస్ట్రీలోని ప్రముఖ నటీనటులు కూడా సినిమా లో భాగంగా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొంత మంది పేర్లను కూడా చర్చల్లోకి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో కొంత మంది నటీనటులు కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

 ఈ స్టార్స్ నటిస్తున్నారా?

ఈ స్టార్స్ నటిస్తున్నారా?

ఇటీవల వినిపించిన టాక్ ప్రకారమైతే తమిళ ఇండస్ట్రీ నుంచి విజయ్ సేతుపతి ని విలన్ గా పాత్ర కోసం తీసుకోబోతున్నట్లు గా ఒక టాక్ వినిపించింది. అంతేకాకుండా మలయాళం ఇండస్ట్రీ నుంచి ఫాహాద్ ఫాజిల్ ను కూడా ముఖ్యమైన పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. ఆ లిస్టులో మరొక మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా సినిమాలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కన్నడ పరిశ్రమలో నుంచి కూడా ఒక ప్రముఖ నటుడు సినిమాలో నటించే ఛాన్స్ ఉందట. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

సినిమా వచ్చేది ఎప్పుడంటే?

సినిమా వచ్చేది ఎప్పుడంటే?

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నెలలో నే మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదివరకే సినిమాను ఆఫీషియల్ గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా మరో హీరోయిన్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక సినిమాను ఈ ఏడాది వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ఎలా చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X