Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: పరేడ్ నడిపించిన ఇండియన్ ఆర్మీ ఏకైక మహిళా కంటింజెంట్ కమాండర్ కెప్టెన్ ప్రీతి చౌదరి
- Sports
సన్రైజర్స్ బ్యాట్స్మెనా? మజాకా? సిక్సర్ కొడితే బంతి పనికిరాకుండా పోయింది!వీడియో
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ బాబుతో మరో సినిమా చేయబోతున్న కొరటాల.. కానీ డైరెక్షన్ చేయడట..
టాలీవుడ్ బిగ్గెస్ట్ కాంబినేషన్స్ లలో మహేష్ బాబు, కొరటాల శివ కాంబో ఒకటి. మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం శ్రీమంతుడు. ఇక మళ్ళీ ప్లాపుల్లో ఉన్నప్పుడు పైకి లేపిన సినిమా భరత్ అనే నేను. అలాంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడితో మహేష్ మరో సినిమా చేస్తే అంచనాల డోస్ మామూలుగా ఉండదు. ఇక మరోసారి ఒక సినిమా కోసం వాళ్ళు కలవబోతున్నట్లు తెలుస్తోంది. కానీ కొరటాల డైరెక్షన్ చేయడట.

సర్కారు వారి పాటకు.. కొరటాల..
మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమాపై అభిమానుల్లో అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. అయితే ఆ సినిమాకు కొరటాల శివ రైటింగ్ విషయంలో కొంత సపోర్ట్ కూడా చేసినట్లు సమాచారం.

మహేష్ సినిమాకు నిర్మాతగా
మహేష్ బాబు ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఈ మధ్య కొరటాల శివ నుంచి కూడా సూచనలు తీసుకుంటున్నాడట. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. త్వరలోనే కొరటాల శివ నిర్మాతగా మారి మహేష్ బాబుతో సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన రూమర్స్ ఇండస్ట్రీలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి.

దర్శకుడు అతడే..
మహేష్ బాబుకోసం కొరటాల ఒక అద్భుతమైన కథను రెడీ చేయిస్తున్నాడట. ఛలో, భీష్మ వంటి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల మహేష్ బాబుతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే కొరటాల సలహా మేరకు కథను కొంత మారుస్తున్నారట. మెయిన్ పాయింట్ నచ్చడంతో మళ్ళీ డెవలప్ చేయాలని ఈ అగ్ర దర్శకుడు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆ నిర్మాతతో కలిసి..
ఇక కథ సెట్టయితే మహేష్ బాబుకు కొరటాల సమక్షంలోనే ఫుల్ స్టోరీని వినిపించనున్నారట. మహేష్ గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే కొరటాల శివ తన ఫ్రెండ్ సుధాకర్ మిక్కిలినేనితో కలిసి సినిమాను నిర్మించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. సుధాకర్ నెక్స్ట్ బన్నీ, కొరటాల శివ ప్రాజెక్టును నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఇక మహేష్ తో వేసిన ప్లాన్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.