దర్శకుల లిస్టును పెంచుతున్న మహేష్... ఏదైనా ఆ సినిమా తరువాతే..
సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఎలాంటి దర్శకుడైనా సరే నిత్యం రేడిగానే ఉంటారు. డేట్స్ ఇచ్చారంటే చాలు అడ్వాన్సులు ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే మహేష్ మాత్రం తొందరపడకుండా చాలా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న మహేష్ ఎలాగైనా ఇయర్ ఎండింగ్ లోపు మరో సినిమాను తేవాలని ప్రయత్నాలు గట్టిగానే చేశాడు కానీ కరోనా దెబ్బకు వర్కవుట్ కాలేదు.
ఇక మొత్తానికి పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాను ఎనౌన్స్ చేసిన మహేష్ వీలైనంత త్వరగా ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఇప్పట్లో ఆ సినిమా పూర్తయ్యే ఛాన్స్ లేదు. యూఎస్ లో చేయాల్సిన షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసుకొని, మరో షెడ్యూల్ ని హైదరాబాద్ లో స్టార్ట్ చేయనున్నారు. ఇక రాజమౌళితో మహేష్ కొత్త సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో తెలియదు గాని ప్రస్తుతం మాత్రం చాలా మంది కథలు చెబుతుంటే వింటున్నాడట.

ఇదివరకే అనిల్ రావిపూడితో మరో సినిమా తప్పకుండా ఉంటుందని చెప్పిన మహేష్ అలాగే సుకుమార్ తో కూడా ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాడు. అసలైతే అల్లు అర్జున్ పుష్ప కంటే ముందే సుకుమార్ తో మహేష్ సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక త్రివిక్రమ్ పై కూడా మహేష్ ఫోకస్ పెట్టాడని మొన్ననే అర్ధమయ్యింది.
అయితే మహేష్ ఈ దర్శకులకు క్లారిటీ ఇవ్వాలి అంటే ముందు రాజమౌళి సినిమాపై క్లారిటీ రావాలి. ఆయన ఎప్పుడూ మొదలు పెడతారు ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది ఎవరికి తెలియదు. చేతిలో ఉన్న RRR కోసం మరో ఏడాది సమయం కూడా పట్టవచ్చు. అందుకే మహేష్ కథలు వింటున్నప్పటికి డేట్స్ విషయంలో మాత్రం కొంచెం కూడా క్లారిటీ ఇవ్వడం లేదట. కథలు నచ్చడంతో చేతిలో ఉన్న సినిమా అయిపోయే వరకు దర్శకులను వెయిట్ చేయమని చెబుతున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











