మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న నిర్ణయంపై మహేష్ బాబు అప్సెట్.. ఎందుకంటే?

కరోనా ప్రభావం వలన మళ్ళీ చిత్ర పరిశ్రమలో గందరగోళం నెలకొంది. విడుదల తేదీల విషయంలో స్టార్ హీరోల మధ్య మళ్లీ తీవ్ర స్థాయిలో పోటీ నెలకొనే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఒక్క రోజులోనే మారిపోతున్నాయి. అయితే ముందుగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కొన్ని సినిమాలు కూడా వేరే సినిమాల కారణంగా వాయిదా పడాల్సి వస్తోంది. ఇక ఇటీవల ఆచార్య యూనిట్ సినిమా విడుదల తేదీ ని మారుస్తూ ఏప్రిల్ ఒకటవ తేదీ ఫిక్స్ చేశారు. ఇక అదే రోజు మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా రానుంది. ప్రస్తుతం ఓ వర్గం మీడియా లో చిరంజీవి తీసుకున్న నిర్ణయంపై మహేష్ బాబు యూనిట్ అసంతృప్తిగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అది ఎంతవరకు నిజం అనే విషయంలోకి వెళ్తే..

 హీరోల మధ్య మంచి వాతావరణం

హీరోల మధ్య మంచి వాతావరణం

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అయితే అగ్ర హీరోల మధ్య ఒక మంచి వాతావరణం కొనసాగుతోంది. ఒకప్పుడు అగ్ర హీరోల మధ్య చాలా డిస్టెన్స్ ఉండేదని అందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం మారుతున్న కాలం కొద్ది అభిమానులు ఇంకా అలాగే ఉన్నప్పటికీ కొందరు స్టార్ హీరోలు మాత్రం ఇతర హీరోలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందుకే సినిమాల విడుదల విషయంలో క్లాష్ కూడా ఎదురైనప్పుడు ఒకరికి ఒకరు కూర్చుని మాట్లాడుకుంటు సమస్యకు పరిష్కారం వేతుకుతున్నారు.

 కరోనా కారణంగా..

కరోనా కారణంగా..

కొన్ని సార్లు పరిస్థితుల ప్రభావం వలన కూడా ఈ హీరోల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది.. ఆ గ్యాప్ లోనే కొన్ని అపోహలు కూడా ఒకరిపై ఒకరు తప్పుగా కామెంట్ చేసుకునే వరకు కూడా వెళుతూ ఉంటాయి. కరోనా కారణంగా చాలా మంది హీరోలు మధ్యలో కూడా భేదాలు ఎదురవుతున్నాయి అన్నట్లుగా ఇండస్ట్రీలో ఒక గాసిప్ వైరల్ గా మారుతోంది.

అప్పుడే మార్చుకున్న మహేష్

అప్పుడే మార్చుకున్న మహేష్


ముందుగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కొందరు ఎలాంటి పోటీ ఉండకూడదు అనే ఆలోచనతో ఉండగా.. అదే తేదీ లో మరికొంత మంది హీరోలు పోటీకి వస్తుండడంతో అక్కడే అసలు సమస్య ఎదురవుతుంది. అయితే మహేష్ బాబు RRR రాజమౌళి కోసం సంక్రాంతి రిలీజ్ డేట్ను ఎప్పుడో మార్చుకున్నాడు.. ఇక ఏప్రిల్ ఒకటో తేదీన SVP సినిమాను విడుదల చేయాలని మహేష్ బాబు తన చిత్ర నిర్మాతలతో బలమైన నిర్ణయం కూడా తీసుకున్నాడు.

ఆచార్య డేట్ ఫిక్స్..

ఆచార్య డేట్ ఫిక్స్..

ఇటీవల ఏప్రిల్ ఒకటో తేదీన ఆచార్య సినిమా విడుదల చేస్తున్నట్లుగా అఫీషియల్ గా మరో క్లారిటీ రావడంతో మహేష్ బాబు యూనిట్ కాస్త అప్సెట్ అయినట్లుగా కూడా కథనాలు వెలువడ్డాయి. ఇక మహేష్ బాబు సర్కారు వారి పాటు చిత్ర యూనిట్ సభ్యులను ఏమాత్రం సంప్రదించకుండా ఆచార్య విడుదల తేదీ ఫిక్స్ చేసుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వెలువడినట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ వైరల్ గా మారింది.

మహేష్ తో మంచి అనుబంధం

మహేష్ తో మంచి అనుబంధం


నిజానికి చిరంజీవికి మహేష్ బాబు కి చాలా మంచి సాన్నిహిత్యం ఉంది అని అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఆచార్య దర్శకుడు కొరటాల శివ మహేష్ బాబు రెండు సినిమాలు చేశారు కాబట్టి.. వారి మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. అయితే SVP ఆగస్టు లోకి షిఫ్ట్ అయింది అని తెలుసుకున్న తర్వాతనే ఆచార్య ఏప్రిల్ ఒకటవ తేదీ ని ఫిక్స్ చేసుకున్నట్లుగా మరొక టాక్ వినిపిస్తోంది.

మహేష్ అప్సెట్?

మహేష్ అప్సెట్?

కానీ ఆ విషయంలో ఇంకా SVP యూనిట్ అఫిషియల్ గా క్లారిటీ ఇచ్చింది లేదు. ఏప్రిల్ 1 అనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఆచార్య యూనిట్ కూడా ఏప్రిల్ 1 అనడంతో మహేష్ అప్సెట్ అయినట్లు టాక్ వస్తోంది. ఇక ఇది ఎంత వరకు నిజం అదే విషయంలో ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ మహేష్ బాబుకి మెగాస్టార్ చిరంజీవిపై అప్సెట్ అయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X