త్రివిక్రమ్, మహేష్ బాబు మధ్య థమన్ చిచ్చు.. ఏం జరిగిందంటే..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న బిగ్ బడ్జెట్ మూవీ SSMB 28. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కారణంగా ఒక చిచ్చు మొదలైనట్లు తెలుస్తోంది. మహేష్, త్రివిక్రమ్ మధ్యలో కూడా విబేధాలు వచ్చినట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఇంతకు ఏం జరిగింది అని వివరాల్లోకి వెళితే..

అద్భుతమైన రెస్పాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు మూడవసారి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే 30% ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ప్రత్యేకంగా ఉగాది రోజు ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు ఆ పోస్టర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఫ్యాన్స్ కు నచ్చేలా..
ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగానే మహేష్ బాబును సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నట్లు ఆ పోస్టర్ ద్వారా క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఈ సినిమా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండే విధంగా దర్శకుడు తెరపైకి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కథలో కూడా ఒక డిఫరెంట్ పాయింట్ను త్రివిక్రమ్ హైలెట్ చేయబోతున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది.

ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు
ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో అయితే ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అసలైతే ఉగాది రోజే పోస్టల్ ద్వారా సినిమా టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేయాలని అనుకున్నారు. అమరావతికి అటు ఇటు.., అర్జునుడు అని.. ఇలా రకాల టైటిల్స్ అయితే చర్చల దశలో ఉన్నట్లుగా ఆ మధ్య టాక్ వినిపించింది. కానీ ఫ్యాన్స్ నుంచి ఆ టైటిల్స్ విషయంలో కాస్త నెగిటివ్ టాక్ రావడంతో మళ్ళీ వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.

థమన్ వలన గొడవలు
ఇక అసలు విషయంలోకి వస్తే ఇటీవల చిత్ర యూనిట్ సభ్యుల మధ్యన అయితే థమన్ కారణంగా కాస్త గొడవలు మొదలైనట్లుగా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. థమన్ తో ఇదివరకే అల..వైకుంఠపురములో సినిమా చేసి ఇండస్ట్రీ హాట్ సొంతం చేసుకున్న త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా ఇంతకుముందే కథనాలు వెలుపడ్డాయి. ముఖ్యంగా ఇప్పుడు మహేష్ బాబుకు త్రివిక్రమ్ కు మధ్యలో థమన్ కారణంగానే గొడవలు జరుగుతున్నట్లుగా కూడా ఒక టాపిస్తోంది.

ట్యూన్స్ కారణంగా
అసలు వివరాల్లోకి వెళితే థమన్ SSMB28 ప్రాజెక్టు కోసం మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే థమన్ మూడు నెలల క్రితం త్రివిక్రమ్ మాట్లాడి ట్యూన్స్ రెడీ చేయమని చెప్పాడట. కానీ ఇంతవరకు ఒక్క ట్యూన్ కూడా అతను మెప్పించే విధంగా రెడీ చేయలేనట్లుగా తెలుస్తోంది. చాలాసార్లు మహేష్ బాబు కూడా థమన్ తో చర్చించినట్లు తెలుస్తోంది.

క్రికెట్ కారణంగానే..
అయితే రీసెంట్ గా థమన్ సినిమాకు సంబంధించిన పనిని కాస్త బ్రేక్ ఇచ్చి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో కూడా కాస్త బిజీగా కనిపించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ప్రాక్టీస్ కోసం కూడా థమన్ కాస్త టైం తీసుకోవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని ముందే చిత్ర యూనిట్ తో కూడా చెప్పారట. కానీ వాళ్ళు మాత్రం ట్యూన్స్ వీలైనంత తొందరగా రెడీ చేస్తే బెటర్ అని కూడా సూచనలు ఇచ్చారని తెలుస్తోంది.

అతని స్థానంలో మరొకరు?
అయితే ఇప్పటివరకు థమన్ ట్యూన్స్ ఏమీ రెడీ చేయకపోవడంతో మహేష్ బాబు త్రివిక్రమ్ తో మాట్లాడే మరొకరిని తీసుకుంటే బెటర్ అనే చర్చించినట్లుగా కూడా ఇండస్ట్రీలో ఒక వస్తోంది. థమన్ స్థానంలో దేవిశ్రీప్రసాద్ లేదా అనిరుద్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











