మహేశ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: వంశీ పైడిపల్లితో సినిమాకు బ్రేక్..సూపర్ స్టార్ కెరీర్‌లో ఇదే ఫస్ట్

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో మహేశ్ బాబు ఒకడు. సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినిమాల్లోకి వచ్చిన అతడు.. తక్కువ వ్యవధిలోనే తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిపోయాడు. హ్యాండ్సమ్‌ లుక్‌తో పాటు యాక్టింగ్ కూడా బాగా చేయగలిగే హీరో కావడంతో సూపర్ స్టార్‌కు అభిమానులు కూడా భారీగానే ఉన్నారు. దీంతో మహేశ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే, తాజాగా అతడు చేయాలనుకున్న సినిమా ఒకటి ఆగిపోయిందని ఓ వార్త లీక్ అయింది. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.!

హ్యాట్రిక్ కొట్టాడు.. అంతకు మించి రాబట్టాడు

హ్యాట్రిక్ కొట్టాడు.. అంతకు మించి రాబట్టాడు


ఈ సంక్రాంతికి మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు' అనే మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఈ మూవీతో మహేశ్ ఖాతాలో హిట్ల హ్యాట్రిక్ (భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు) నమోదైంది. అలాగే, గతంలో లేనన్ని రికార్డులను అందుకున్నాడు.

సూపర్ హిట్ కాంబో రిపీట్ చేయబోతున్నాడు

సూపర్ హిట్ కాంబో రిపీట్ చేయబోతున్నాడు


సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కాకముందే మహేశ్ బాబు.. స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ విషయాన్ని సదరు దర్శకుడే స్వయంగా ప్రకటించాడు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. దీనికి కారణం మహేశ్ - వంశీ కాంబినేషన్‌లో గతంలో ‘మహర్షి' అనే సూపర్ హిట్ సినిమా రావడమే.

ఇంతకు ముందెన్నడూ చేయని విధంగా..

ఇంతకు ముందెన్నడూ చేయని విధంగా..

ఈ సినిమా మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో సాగేలా తెరకెక్కబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. విశాఖపట్నం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేశ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ తరహా పాత్రలో సూపర్ స్టార్ ఎప్పుడూ నటించకపోవడంతో ఈ ప్రాజెక్టుపై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది.

షాకింగ్: వంశీ పైడిపల్లితో సినిమాకు బ్రేక్

షాకింగ్: వంశీ పైడిపల్లితో సినిమాకు బ్రేక్


ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం... హిట్ కాంబోలో వస్తుందనుకుంటున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ సమయంలోనే ఆగిపోయిందట. దీంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు.

సూపర్ స్టార్ కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైమ్.!

సూపర్ స్టార్ కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైమ్.!

ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్న సమయంలోనే దానికి గల కారణం కూడా ప్రచారం అవుతోంది. తాజా సమాచారం ప్రకారం... వంశీ పైడిపల్లి చెప్పిన లైన్ బాగున్నప్పటికీ... ఆయన తయారు చేసిన స్క్రిప్టు పట్ల మహేశ్ సంతృప్తిగా లేడట. కథలో మార్పులు చేయాల్సి వస్తే ఇంకా ఆలస్యం అవుతుందని భావించి దీనిని ఆపేసినట్లు సమాచారం. ఇలా సినిమా ఆగిపోవడం మహేశ్ కెరీర్‌లో మొదటిసారి అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X