ఆగిపోయిన వంశీ పైడిపల్లి - మహేశ్ సినిమా.. అసలు కారణం తెలిసి షాక్ అవుతోన్న సినీ పెద్దలు.!
వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. కొన్నేళ్లుగా టాప్ చైర్‌పై కన్నేసిన ఈ స్టార్ హీరో.. అందుకు అనుగుణంగానే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఫలితంగా మహేశ్ బాబు మార్కెట్ గణనీయంగా పెరిగిపోతోంది. దీంతో అతడి రెమ్యూనరేషన్‌పై ప్రభావం పడుతోంది. తాజాగా సూపర్ స్టార్ చేయాల్సిన సినిమా ఆగిపోవడం గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది. ఇంతకీ ఏంటా న్యూస్.? పూర్తి వివరాల్లోకి వెళితే....

ఒక్క సినిమాతో మొత్తం మారిపోయింది
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాతో అతడి ఖాతాలో భరత్ అనే నేను, మహర్షి తర్వాత హ్యాట్రిక్ హిట్ నమోదైంది. అంతేకాదు, ఈ సినిమా వల్ల మహేశ్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. అలాగే, సూపర్ స్టార్ మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది.

హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కు మహేశ్ గ్రీన్ సిగ్నల్
సరిలేరు నీకెవ్వరు ఇచ్చిన జోష్‌తో జోరు మీద ఉన్నాడు మహేశ్ బాబు. ఈ క్రమంలోనే అతడు తనకు మహర్షి వంటి సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మహేశ్ కోసం అతడు మాఫియా బ్యాగ్‌డ్రాప్ ఉన్న స్క్రిప్టును రెడీ చేశాడని ప్రచారం జరిగింది. ఈ మూవీలో సూపర్ స్టార్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడని వార్తలు కూడా వచ్చాయి.

మహేశ్ యూటర్న్.. డైరెక్టర్‌కు బిగ్ షాక్
వంశీ పైడిపల్లితో సినిమా కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే మహేశ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సరైన కారణాలైతే తెలియలేదు కానీ, ఈ సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. దీంతో దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో మహేశ్ తర్వాతి సినిమా గురించి చాలా వార్తలు తెరపైకి వస్తున్నాయి.

సినిమా ఆగిపోడానికి అసలు కారణం ఇదే
వంశీ పైడిపల్లి - మహేశ్ బాబు చేద్దామనుకున్న సినిమా ఆగిపోవడానికి అసలు కారణం ఇదేనంటూ తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం... ఈ సినిమాను మహేశ్ తన సొంత బ్యానర్‌పై నిర్మించాలని భావించాడట. అయితే, ఈ సినిమా మేకింగ్‌కు భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి ఉంటుందని దర్శకుడు చెప్పడంతోనే దీన్ని హోల్డ్‌లో పెట్టారని సమాచారం.

ఆయనతో చర్చలు.. ఫలితం శూన్యం
మహేశ్ బాబు ఈ సినిమాకు అంత బడ్జెట్ పెట్టలేనని వంశీ పైడిపల్లికి చెప్పినట్లు తెలిసింది. దీంతో సదరు దర్శకుడు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుతో సంప్రదింపులు జరిపారని అంటున్నారు. అయితే, బడ్జెట్ షేర్ విషయంలో మహేశ్, దిల్ రాజు మధ్య చర్చలు సఫలం కాలేదనే టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే సినిమాను కొద్ది రోజులు ఆపేశారని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











