లీకైన రహస్యం: మహేశ్ బాబు - వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోడానికి నాగార్జునే కారణం.!

By Manoj

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో మహేశ్ బాబు ఒకడు. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని తక్కువ సమయంలోనే ఎక్కువ పేరును సంపాదించుకున్నాడు. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్టులకు సైన్ చేస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన.. వంశీ పైడిపల్లితో చేయాల్సిన సినిమా ఆగిపోయింది. తాజాగా దాని వెనుక ఉన్న అసలు రహస్యం నాగార్జునే అన్న వార్త బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం.!

 హ్యాట్రిక్‌తో పాటు ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

హ్యాట్రిక్‌తో పాటు ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

మహేశ్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు'తో మరో విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దీంతో ఇండస్ట్రీ హిట్ అతడి సొంతం అయింది.

చిరంజీవి సినిమాలో మహేశ్ బాబు

చిరంజీవి సినిమాలో మహేశ్ బాబు

కొరటాల శివ - చిరంజీవి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో ఓ ముఖ్యమైన పాత్రను మహేశ్ బాబు చేస్తున్నాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. సినిమానే మలుపు తిప్పే ఈ పాత్ర 30 నిమిషాల నిడివితో ఉంటుందని అంటున్నారు. ఈ క్యారెక్టర్ కోసం మహేశ్ బాబు ఏకంగా రూ. 30 కోట్లు తీసుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది.

మళ్లీ ఆయనతో అనుకుంటే ఆగిపోయింది

మళ్లీ ఆయనతో అనుకుంటే ఆగిపోయింది

‘సరిలేరు నీకెవ్వరు' ఇచ్చిన జోష్‌లో ఉన్నాడు మహేశ్ బాబు. ఈ ఉత్సాహంతోనే అతడు స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ‘మహర్షి' తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమా ప్రారంభం అవకముందే ఆగిపోయింది. దీంతో అందరూ షాక్ అయిపోయారు.

మొదటిసారి చూడాలనుకున్న వాళ్లకు షాక్

మొదటిసారి చూడాలనుకున్న వాళ్లకు షాక్

వాస్తవానికి వంశీ పైడిపల్లి సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో వార్తలు వినిపించాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో మహేశ్ బాబు గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడని అన్నారు. అంతేకాదు, ఇందులో అతడు రెండు విభిన్న గెటప్‌లలో కనిపిస్తాడని కూడా ప్రచారం జరిగింది. దీంతో సినిమాపై ఆసక్తి పెంచుకున్న ఫ్యాన్స్.. అది ఆగిపోవడంతో నిరాశకు లోనయ్యారు.

 సినిమా ఆగిపోడానికి నాగార్జునే కారణం.!

సినిమా ఆగిపోడానికి నాగార్జునే కారణం.!

ఈ సినిమా ఆగిపోవడం వెనుక అసలు కారణం గురించి తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. ఆ సమాచారం ప్రకారం.. వంశీ చెప్పిన స్క్రిప్టులో సెకెండాఫ్ వీక్‌గా ఉందట. దీన్ని రిపేర్ చేయమని మహేశ్ చెప్పినప్పటికీ.. వంశీ త్వరగా స్పందిచలేదని అంటున్నారు. దీనికి కారణం ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పని చేసే సోలోమన్.. నాగార్జునతో సినిమా చేస్తుండడమే అని టాక్.

Recommended Video

Vijay Devarakonda Tops Most Desirable Man 2019 | Ram Charan | Prabhas
అలా వెళ్లిపోయాడు.. ఇలా క్యాన్సిల్ అయింది

అలా వెళ్లిపోయాడు.. ఇలా క్యాన్సిల్ అయింది

నిజానికి ‘మహర్షి' సినిమాకు సోలోమన్ అసిస్టెంట్ రైటర్‌గా పని చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో దీనికి కూడా వర్క్ చేయమని అతడిని కోరాడట వంశీ. సీనియర్ హీరో నాగార్జున అతడికి దర్శకుడిగా అవకాశం ఇవ్వడంతో మహేశ్ సినిమాకు పని చేయలేకపోయాడని అంటున్నారు. దీంతో ‘వైల్డ్ డాగ్' పట్టాలెక్కగా.. సూపర్ స్టార్ మూవీ క్యాన్సిల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X