జ్వరంతో ‘సీతమ్మ వాకిట్లో...’ షూటింగ్ ఆగింది
వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం షూటింగ్ కొద్ది రోజుల క్రితం అగింది. దానికి కారణం సమంత జ్వరంతో భాధపడటమే అని తెలుస్తోంది. ఆమె తేరుకుని రికవరి అయ్యాక సమంత, మహేష్ ల కాంబినేషన్ సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తోంది. వెంకటేష్ కాంబినేషన్ సీన్స్ చేద్దామంటే.. షాడో షూటింగ్ లో బిజీగా ఉండటంతో మహేష్ ఖాళీగా ఉండాల్సిన స్ధితి వచ్చిందని సమాచారం. గతంలోనూ ప్రకాష్ రాజ్ తో విభేదాలతో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై బ్రేక్ పడింది.
తండ్రికి చేసిన వాగ్ధానం నిలబెట్టుకోవటం కోసం ఇద్దరు అన్నదమ్ములు ఏం చేసారన్నదే... ఈ చిత్రం స్టోరీలో కీ పాయింట్. వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా చేస్తున్నారు. ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లాడుతూ... ఆస్తిపాస్తుల ముందు అన్నదమ్ముల బంధాలకు విలువ లేని కాలమిది. చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనుకొంటూ ఎవరి బతుకులు వాళ్లు బతికేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా నాన్న దగ్గర చేసిన వాగ్ధానం కోసం ఆ అన్నదమ్ములు ఏం చేశారో తెర మీదే చూడాలంటున్నారు దిల్ రాజు. ఆయన నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'... అలాగే మల్టీస్టారర్ చిత్రాల్లో ఇదో ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని, అనుబంధాల విలువనీ హృద్యంగా చెప్పే ప్రయత్నమిది అన్నారు .
సమంత, అంజలి హీరోయిన్స్ గా చేస్తున్న తమ చిత్రంలో వారి పాత్రలు కూడా కథకు కీలకమైనవేనని చెప్పారు. ఇందులో ఒక్క పాత్ర కూడా వృథాగా ఉండదు. ఒక్క సీన్ వేస్ట్‌గా ఉండదు. అంత పగడ్బందీ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందిస్తున్నాం. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నన్ను దర్శకుడిగా పరిచయం చేసిన ఆయన బేనరులోనే రెండో సినిమా కూడా చేయడం అదృష్టంగా భావిస్తున్నానని శ్రీకాంత్ అడ్డాల చెప్పాడు. అలాగే ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్, మహేష్ బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు.
ప్రస్తుతం 30 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించాం అని చెప్పుకొచ్చారు. ఈ నెల 9నుంచి రెండో షెడ్యూల్ మొదలు అయ్యింది. ఈ షెడ్యూల్‌లోనే ప్రకాష్ రాజ్ పాత్ర ప్రవేశిస్తుంది. మహేష్, ప్రకాష్ రాజ్‌లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. హైదరాబాద్‌లోనే ఈ షెడ్యూల్ జరుగుతుంది'' అని తెలిపారు దర్శకుడు. జయసుధ, రోహిణీ హట్టంగడి, శ్వేతాప్రసాద్, రవిబాబు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: కె.వి.గుహన్. సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











