»   » పవన్ కళ్యాణ్ కోసం....మహేష్ బాబును ఒప్పిస్తున్నారు!

పవన్ కళ్యాణ్ కోసం....మహేష్ బాబును ఒప్పిస్తున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ హిట్ 'ఓ మై గాడ్' సినిమాకి రీమేక్ ఓ చిత్రాన్ని పవన్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏర్పాట్లు మెగా స్పీడుతో జరుగుతున్నాయి. ఈ చిత్రానికి 'దేవ దేవం భజే' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. పవన్ సూపర్ హిట్ అత్తారింటికి దారేది చిత్రంలో 'దేవ దేవం భజే' ట్రాక్ ఉంది. అప్పట్లో ఎమ్.ఎస్ సుబ్బలక్ష్మి గానం చేసిన ఈ ట్రాక్ చాలా పాపులర్. దేవుడికి,భక్తుడికి చెందిన చిత్రం కాబట్టి ఈ టైటిల్ సూటయ్యే అవకాసం ఉందని భావిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. గతంలో 'జల్సా' చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగానే 'దేవ దేవం భజే'చిత్రానికి కూడా మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ ఇప్పించేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. ఇలా చేస్తే సెంటిమెంటు కలిసొస్తుందని, జల్సా మాదిరిగా ఈ చిత్రం కూడా పెద్ద హిట్టవుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు మహేష్ బాబును ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట.

Mahesh Babu voice over for 'Deva Devam Bhaje'

తెలుగు నేటివిటికి తగినట్లు ఈచిత్రాన్ని మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా ఒరిజనల్ లో ఉన్న పరేష్ రావెల్ పాత్ర కు ఇద్దరు పిల్లలు ఉంటే..ఇక్కడ వెంకటేష్ కి ఇద్దరు చెల్లెళ్లు ఉండేలా మార్చారని తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ గెటప్ సైతం పూర్తి మార్పుతో ఉంటుందని,దానిపై కసరత్తు జరిగిందని చెప్తున్నారు. మొదట వెంకటేష్ తో షూటింగ్ మొదలు పెట్టి తర్వాత పవన్ తో ఫినిష్ చేస్తారు. ఈ మేరకు ప్రత్యేకమైన వీధి సెట్ ని వేసారు.

'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

English summary
Earlier Mahesh gave voice over to Pawan’s Jalsa and it became a super hit and Pawan’s fans hope Mahesh’s voice over success sentiment to continue with Deva Devam Bhaje.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu