Acharya మూవీలో మహేశ్ బాబు: చిరంజీవి, చరణ్‌ అడగ్గానే.. సినిమాలో హైలైట్ అదేనట

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోల మధ్య సత్సంబంధాలు బాగా పెరిగిపోయాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరి సినిమాలకు ఒకరు ప్రమోషన్ చేయడం.. మూవీలు బాగుంటే అభినందించడం.. టీజర్లు, ట్రైలర్లు ఇలా ఎన్నో అప్‌డేట్లను విడుదల చేయడం వంటివి చేస్తూ తామంతా ఒక్కటేనని తెలుగు హీరోలు చాటి చెప్తున్నారు.

అదే సమయంలో వేరే హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోడానికి కూడా సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగా మల్టీస్టారర్ మూవీ 'ఆచార్య' కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రంగంలోకి దిగుతున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

 మెగా హీరోలో కాంబోలో ‘ఆచార్య'

మెగా హీరోలో కాంబోలో ‘ఆచార్య'

మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రలను పోషిస్తోన్న చిత్రం 'ఆచార్య'. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మించాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

భారీ అంచనాలు.. బిజినెస్ ఇలా

భారీ అంచనాలు.. బిజినెస్ ఇలా

ఇద్దరు స్టార్ హీరోల కలయికలో రాబోతున్న మూవీ కావడంతో.. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా 'ఆచార్య'ను రూపొందించారు. అందుకు అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఫలితంగా దీనికి అన్ని ప్రాంతాల్లో భారీ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

రిలీజ్‌కు రెడీ.. ప్రమోషన్స్ షురూ

రిలీజ్‌కు రెడీ.. ప్రమోషన్స్ షురూ

'ఆచార్య' మూవీని ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. కానీ పలు కారణాలతో అప్పుడు వాయిదా పడ్డ ఈ మూవీని ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేసింది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. దీంతో ఆచార్య సందడి క్రమంగా పెరుగుతోంది.

అలాంటి కథతో వస్తున్న ఆచార్య

అలాంటి కథతో వస్తున్న ఆచార్య

వాస్తవానికి కొరటాల శివ సినిమాలు అంటేనే సందేశాత్మకంగా తెరకెక్కుతుంటాయి. ఇప్పుడు 'ఆచార్య' కూడా అదే పంథాలో సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ తీశారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటించారు. ఓ మిషన్‌లో భాగంగా సిద్ధ పాత్ర చనిపోతే.. ఆచార్య దాన్ని పూర్తి చేస్తాడని టాక్.

ఆచార్య కోసం సూపర్ స్టార్ రాక

ఆచార్య కోసం సూపర్ స్టార్ రాక

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'ఆచార్య' మూవీ విడుదలకు సిద్ధం అవుతోన్న నేపథ్యంలో దీని గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ చిత్రంలోని హైలైట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా భాగం అయినట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.

ఇద్దరు అడగ్గానే ఒప్పుకున్నాడు

ఇద్దరు అడగ్గానే ఒప్పుకున్నాడు

తాజా సమాచారం ప్రకారం.. 'ఆచార్య' మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడట. చిరంజీవి, చరణ్ కోరిక మేరకు అతడు దీనికి ఒప్పుకున్నాడట. అతడి గొంతు ద్వారానే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య పాత్రతో పాటు రామ్ చరణ్ చేస్తోన్న సిద్ధ రోల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడట. గంభీరమైన స్వరంతో మహేశ్ చెప్పే డైలాగులు హైలైట్ అవుతాయట.

అలా మిస్సైంది.. ఇప్పుడు ఇలా

అలా మిస్సైంది.. ఇప్పుడు ఇలా

వాస్తవానికి 'ఆచార్య' మూవీలో మహేశ్ బాబు నటిస్తున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని చిత్ర దర్శకుడు కొరటాల కూడా కన్ఫార్మ్ చేశాడు. కానీ, ఎందుకనో ఈ కాంబో వర్కౌట్ కాలేదు. ఆ తర్వాతనే ఆ పాత్ర కోసం రామ్ చరణ్‌ను తీసుకున్నారు. అలా ఇందులో నటించే ఛాన్స్ మిస్ అయిన మహేశ్ బాబు.. ఇప్పుడు వాయిస్ ఓవర్‌తో ఇందులో భాగం అయిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X