టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో: ప్రభాస్ సినిమాలో మహేశ్ బాబు.. బాలీవుడ్ స్టార్ కూడా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా హవాను చూపించి.. కొంత కాలంగా పాన్ ఇండియాపై ఫోకస్ చేస్తున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి' తర్వాత తన క్రేజ్‌ను, మార్కెట్‌ను అంతకంతకూ పెంచుకుంటూనే ఉన్న ఈ స్టార్ హీరో.. వరుసగా భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను కూడా ప్రేక్షకులకు అందించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ 'రాధే శ్యామ్' అనే సినిమాను చేశాడు.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా భాగం కాబోతున్నాడని తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

రాధే శ్యామ్‌తో రెడీ అయిన ప్రభాస్

రాధే శ్యామ్‌తో రెడీ అయిన ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమే 'రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్నాడు.

ఎన్నో అప్‌డేట్లు... భారీ స్పందన

ఎన్నో అప్‌డేట్లు... భారీ స్పందన

ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్'కు సంబంధించి ఆరంభం నుంచి అప్‌డేట్లు అంతగా రాలేదు. దీంతో చిత్ర యూనిట్‌పై అతడి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య టీజర్, ఆ తర్వాత ప్రతి పండుగకూ ఒక పోస్టర్ చొప్పున వదిలారు. అలాగే, ఇటీవలే విడుదలైన ట్రైలర్ అయితే టాలీవుడ్‌లోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే.

రాధే శ్యామ్ మూవీ బిజినెస్ భారీగా

రాధే శ్యామ్ మూవీ బిజినెస్ భారీగా

'రాధే శ్యామ్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికితోడు ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్ వల్ల అవన్నీ రెట్టింపు అయ్యాయి. దీంతో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగులోనే కాదు.. మిగిలిన భాషల్లోనూ ఇది రికార్డు స్థాయిలో వ్యాపారం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

రిలీజ్ డేట్.. అత్యధిక థియేటర్లు

రిలీజ్ డేట్.. అత్యధిక థియేటర్లు

భారీ బడ్జెట్‌తో రూపొందిన 'రాధే శ్యామ్' మూవీ పలుమార్లు వాయిదా పడడంతో ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని మార్చి 11 విడుదల చేస్తామని అధికారికంగా వెల్లడించారు. అంతేకాదు, దీన్ని ఇండియాలోనే మరే సినిమా విడుదల కాని విధంగా.. ఎక్కువ థియేటర్లలో తీసుకు రాబోతున్నారని కూడా తెలిపారు.

రాధే శ్యామ్‌కు అమితాబ్ సాయం

రాధే శ్యామ్‌కు అమితాబ్ సాయం

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'రాధే శ్యామ్' మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరో పాత్రను, కథాంశాన్ని వివరిస్తూ ప్రతి భాషలోనూ వాయిస్ ఓవర్ ఉంటుందట. హిందీ వెర్షన్‌కు అమితాబ్ బచ్చన్ సహాయం తీసుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

ప్రభాస్ సినిమాలో మహేశ్ బాబు

ప్రభాస్ సినిమాలో మహేశ్ బాబు

'రాధే శ్యామ్' సినిమాలో వాయిస్ ఓవర్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. అందుకే తెలుగులో దీన్ని ఎవరితో చెప్పించాలి అని చిత్ర యూనిట్ తర్జనభర్జన పడినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు సహాయం తీసుకుంటున్నారట. ఇప్పటికే అతడు వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

అప్పుడే రికార్డ్ చేయబోతున్నారు

అప్పుడే రికార్డ్ చేయబోతున్నారు

ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దీంతో వీలు చూసుకుని రికార్డింగ్ స్టూడియోకు వస్తానని ప్రభాస్‌కు హామీ ఇచ్చాడట. అంటే ఫిబ్రవరి నెలాఖరున లేదా మార్చి మొదటి వారంలో ఈ పని పూర్తి చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రభాస్ సినిమాలో మహేశ్ వాయిస్ వినిపిస్తుండడంతో ఇద్దరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X