ఎన్టీఆర్ బాద్ షాకు మహేష్ వాయిస్ ఓవర్?
హైదరాబాద్: తెలుగు హీరోలు చాలా మందితో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు మంచి సంబంధాలున్నాయి. ప్రభాస్, తదితరులతో జూనియర్ ఎన్టీఆర్‌కు సత్సంబంధాలున్నాయి. మామూలుగా అయితే మహేష్ బాబును జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యర్థిగా అందరూ భావిస్తూ ఉంటారు. టాలీవుడ్‌లో మహేష్ బాబుతో జూనియర్ ఎన్టీఆర్ పోటీ పడుతుంటారనే భావన ఉంది.
అయితే, ఆ భావనలన్నీ తప్పు అని చెప్పేందుకు ఓ సంఘటన చోటు చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు సమాచారం. అదే నిజమైతే బాద్ షా సినిమాకు మరింత క్రేజ్ వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ అందరితోనూ మంచి సంబంధాలనే కోరుకుంటుకుంటారని చెప్పడానికి ఇదో నిదర్శనం.
ఏదో లోపల పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ స్నేహం చేయరని అంటారు. స్వభావాన్ని బట్టి మనసులో ఏమీ పెట్టుకోకుండా తనకు నచ్చితే స్నేహం చేస్తారని చెబుతారు. జూనియర్ ఎన్టీఆర్‌తో మహేష్ బాబుకు కూడా ఏ విధమైన వ్యతిరేకత లేదు. ఈ విధమైన స్నేహం తెలుగు సినీ రంగంలో ఆహ్వానించదగిన పరిణామానికి దారి తీస్తుందని భావించవచ్చు.
శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న బాద్ షా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటించింది. ఇటీవలే సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది.


Click it and Unblock the Notifications











