గీతా గోవిందం డైరెక్టర్‌కు షాక్.. మనసు మార్చుకొన్న మహేష్‌బాబు
సరిలేరు నీకెవ్వరూ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మంచి జోష్‌లో మహేష్ బాబుకు మరో సినిమా కోసం ఏడాది వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత వెంటనే సెట్స్‌పైకి వెళ్దామనే ఉత్సాహంతో మహేష్ ఉరకలేశారు. అయితే కరోనావైరస్, లాక్‌డౌన్ లాంటి అంశాలు సూపర్‌స్టార్ మహేష్ ఆశలపై నీళ్లు చల్లాయి. దాంతో మూడు నెలలకు ప్రిన్స్ ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా ప్రభుత్వాలు సడలింపులు ఇచ్చి షూటింగులకు అనుమతి ఇవ్వడంతో మహేష్ మళ్లీ రెడీ అయ్యారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో మనసు మార్చుకొన్నారనే వార్తలు మీడియాలో వెలువడుతున్నాయి. అందుకు కారణాలు ఏమిటంటే..

లాక్‌డౌన్ సడలింపుల తర్వాత
లాక్‌డౌన్ సడలింపులతో జూలై రెండోవారంలో పలు సినిమా యూనిట్లు షూటింగులు చేయాలని ఏర్పాట్లలో మునిగిపోయాయి. సర్కారు వారి పాట సినిమా కోసం హడావిడిగా ఏర్పాట్లు మొదలుపెట్టారు. త్వరలోనే కలుసుకొందామంటూ మహేష్ బాబు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ మేరకు ఈ చిత్రంలో ప్రధాన విలన్‌గా కన్నడ సూపర్‌స్టార్ సుదీప్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. జూలైలో షూటింగుకు కావాల్సిన ఏర్పాట్లను పురమాయించారు.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు దారుణంగా
అయితే హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉండటం, కరోనావైరస్ వ్యాప్తి దారుణంగా ఉండటంతో నిర్మాత, దర్శకులు మరోసారి షూటింగులపై పునరాలోచనలో పడ్డినట్టు సమాచారం. ఈ విషయంలో మహేష్ బాబు కూడా మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ చేయడం ఆరోగ్యకరమేనా అనే ప్రశ్నను మహేష్ లేవనెత్తినట్టు తెలుస్తున్నది.

మరోసారి లాక్‌డౌన్ దిశగా
అంతేకాకుండా తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో మరోసారి లాక్‌డౌన్ విధించవచ్చనే వార్తలు సినీ పరిశ్రమకు గుబులు పుట్టిస్తున్నాయి. దాంతో షూటింగులు ఏర్పాట్లు ఆపేసి ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో సర్కారు వారి పాట సినిమా షూటింగును వాయిదా వేయాలని మహేష్ బాబు నిర్ణయించినట్టు సమాచారం.

ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ కంటే..
ప్రస్తుతం సర్కారు వారి సినిమా షూట్ మొదలుపెట్టే కంటే వాయిదా వేయడమే మేలు అనే ఉద్దేశంతో పలువురు నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ఆ క్రమంలోనే గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాంకు తన మనసులోని మాటను మహేష్ బాబు చెప్పారనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నది.
Recommended Video

జూలైలో కష్టం..డిసెంబర్‌లో చూద్దాం
జూలైలో షూటింగులు మొదలు పెట్టేంతగా సానుకూల పరిస్థితులు లేవు. షూటింగులు ప్రారంభించి కష్టాల్లో పడేకంటే డిసెంబర్ వరకు వేచి చూద్దాం. 2020 చివర్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటే సర్కారు వారి పాటను ముందుకు తీసుకెళ్దామని మహేష్ చెప్పినట్టు తెలిసింది. అయితే ఈ వార్త రూమరా? లేక నిజమా అనేది కొద్ది రోజుల్లో స్పష్టం కావడం ఖాయం.


Click it and Unblock the Notifications











