దిల్ రాజుకి వార్నింగ్ ఇచ్చిన మహేష్ బాబు?

By Srikanya

మహేష్ బాబు తాజాగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ మరో హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని అడ్డాల శ్రీకాంత్ డైరక్ట్ చేస్తూండగా,దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల మొదట అనుకున్నట్లుగా దసరాకి కాకుండా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దాంతో మహేష్ బాబు ఈ విషయం తెలుసుకుని దిల్ రాజుని పిలిచి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తరహాలో ఎట్టి పరిస్ధితుల్లోనూ మొదట అనుకున్నట్లుగా విడుదల కావాల్సిందేనని చెప్పాడని,అవసరమైతై మరిన్ని డేట్స్ కేటాయిస్తానని,మిగతా ఆర్టిస్టులతో కూడా మాట్లాడి త్వరగా ఫినిష్ చేయమని చెప్పాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినడపడుతోంది.

గతంలో తన సినిమాలకు వరసగా వచ్చిన గ్యాప్ ని దృష్టిలో పెట్టుకునే ఈ విషయాన్ని మహేష్ బాబు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు చెప్తున్నారు. అయితే దిల్ రాజు వైపు నుంచి నిర్మాణ పరంగా సమస్యలు ఉన్నాయి. ఆయన మొదట అనకున్నట్లుగా షెడ్యూల్ జరగలేదు. ప్రకాష్ రాజు తప్పుకుని మళ్లీ రావటంతో షెడ్యూల్ మొత్తం డిస్ట్రబ్ అయిపోయింది. అయితే మహేష్ చెప్పినట్లుగా అనుకున్న టైమ్ కి ఫినిష్ చేస్తే తనపైన ఫైనాన్స్ ఫరంగా తను ఒడ్డున పడతానని భావిస్తున్నారు.

దాంతో అడ్డాల శ్రీకాంత్ సైతం ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఫినిష్ చేయాలని తన ప్లానింగ్ ని ఎడ్జెస్టు చేసుకుని రీ షెడ్యూల్ చేసుకుంటున్నారు. గత దసరా హ్యాలీడేస్ లో ...దూకుడు ఇచ్చిన కిక్ లాగా ఈ చిత్రం కూడా వర్కవుట్ అవుతుందని మహేష్ చెప్పారని చెప్పుకుంటున్నారు. ఈ నిర్ణయంతో మహేష్ ఫ్యాన్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మహేష్ ఇక నుంచి తన చిత్రాల మధ్య గ్యాప్ ని ఎక్కువ ఉంచుకోదలచుకోదలుచుకోవటం లేదని ఈ సంఘటనతో ప్రూవ్ అయ్యింది.


'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం కాన్సెప్టు గురించి దిల్ రాజు చెపుతూ...ఉమ్మడి కుటుంబంలో అనుబంధాలూ ఆప్యాయతలూ చూసి ఎంతకాలమైంది? ఉద్యోగం పేరుతో ఒకరు రెక్కలు కట్టుకొని విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇంకొకరిది పట్నవాసం. ఇంటిల్లిపాదీ మళ్లీ కలుసుకోవాలంటే పండగో, పెళ్లిపిలుపో రావాల్సిందే. అప్పుడు కూడా సెలవులు దొరికితేనే! అందుకే బాబాయ్‌, పిన్ని, వదిన, మేనత్త... ఇలాంటి పిలుపులకు దూరమైపోతున్నాం. ఆరు బయట వెన్నెల్లో కబుర్లు చెప్పుకొనే రోజులు మర్చిపోతున్నాం. మళ్లీ అలాంటి వాతావరణం మా సినిమాలో చూడొచ్చు అన్నారు.

అలాగే చిత్రంలో వెంకటేష్‌, మహేష్‌బాబులు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. వారిద్దరిపై వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకొంటాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్‌ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారని అన్నారు.సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో మహేష్‌బాబు, సమంత తదితరులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: గుహన్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X