మహేష్ బాబు భయపడే వద్దంటున్నాడు
మహేష్ బాబు తన తాజా చిత్రం దూకుడు రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ టెన్షన్ పెరుగుతున్నట్లుంది.మరో ప్రక్క మీడియాలో ఈ చిత్రం పోకిరి రికార్డులు బ్రద్దలు కొడుతుందని,మగధీరని ఒంటిచేత్తో ప్రక్కన పడేస్తుందని ప్రచారం చేస్తూండటంతో మహేష్ కంగారుపడుతున్నాడు.అనవసరమైన హైప్ వల్లే శక్తి,బద్రీనాధ్ చిత్రాలు బోల్తాపడ్డాయని,వేరే సినిమాలతో జరుగుతున్న సినిమా పోల్చటం సరికాదని అంటున్నాడు.అలాగే తన నిర్మాతలకు కూడా కంగారుపడి మార్కెట్ కోసం కంటిన్యూ ఇంటర్వూలు ఇచ్చి హైప్ క్రియేట్ చేస్తే లేనిపోని ఇబ్బందుల్లో పడవల్సివస్తుందని హెచ్చరిస్తున్నట్లు సమచారం.
మరో ప్రక్క దూకుడు ఆడియో అంతగా క్లిక్ కాకపోవటం కూడా మహేష్ ని ఆలోచనలో పడేసింది.ఖలేజా పరాజయం ఆయన్ని ఇప్పటికీ వెంబడిస్తోంది.మగధీర,పోకిరి వంటి రికార్డులు ముందుగా చెప్పి రావని,వాటంతట అవే ప్రేక్షకాదరణ బట్టి క్రియేట్ అవుతాయని అంటున్నాడు.ఇక ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోను సూద్, సాయాజీ షిండే, నాజర్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, మాస్టర్ భరత్, సురేఖావాణి, సుధ, వినయప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: కె.వి.గుహన్, రచన: గోపి మోహన్, కోన వెంకట్, సమర్పణ: జి.రమేష్‌బాబు.


Click it and Unblock the Notifications











