For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాకింగ్: సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరిన మహేశ్.. ఫ్యాన్స్ కోసం చేసిన పని వల్లే ఈ కష్టాలు.!

  By Manoj Kumar P
  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో మహేశ్ బాబు పేరు ప్రథమంగా వినిపిస్తోంది. దీనికి కారణం అతడి సినిమాలు.. అవి సృష్టిస్తోన్న రికార్డులే. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించిన ఈ హ్యాండ్సమ్ హీరో.. తక్కువ వ్యవధిలోనే ఊహించని స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. కెరీర్ ఆరంభంలోనే పలు సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు ఎన్నో అవార్డులను సైతం అందుకున్నాడు. దీంతో మహేశ్ టాప్ స్టార్ అయిపోయాడు. తాజాగా అతడి ఆరోగ్యం గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.? వివరాల్లోకి వెళితే...

  హ్యాట్రిక్ కొట్టి సరిలేరు అనిపించుకున్నాడు

  హ్యాట్రిక్ కొట్టి సరిలేరు అనిపించుకున్నాడు

  మహేశ్ బాబు ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అదే సమయంలో కలెక్షన్లనూ భారీగా రాబట్టింది. దీంతో అతడి ఖాతాలో హ్యాట్రిక్ కూడా నమోదైంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. విజయశాంతి, ప్రకాశ్ రాజ్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు.

  వర్షం కురుస్తోంది.. రికార్డులు తేలుతున్నాయి

  వర్షం కురుస్తోంది.. రికార్డులు తేలుతున్నాయి

  సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమా విడుదలై మూడో వారం మొదలైనప్పటికీ కలెక్షన్లు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఈ సినిమా రూ. వంద కోట్ల పైచిలుకు షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే పలు రికార్డులను సైతం బద్దలు కొట్టేస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.

  సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరిన మహేశ్

  సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరిన మహేశ్

  ఒకవైపు ‘సరిలేరు నీకెవ్వరు' రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతుంటే.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు మాత్రం ఓ చేదు వార్త నిరాశను మిగుల్చుతోంది. తాజా సమాచారం ప్రకారం.. మహేశ్ బాబు ప్రస్తుతం అమెరికా టూర్‌లో ఉన్నాడు. ఇందులో భాగంగా సూపర్ స్టార్ ఓ సర్జరీ చేయించుకోబోతున్నాడట. దీని కోసం ఇప్పటికే ఆస్పత్రిలో సైతం చేరిపోయాడని అంటున్నారు.

  ఫ్యాన్స్ కోసం చేసిన పని వల్లే ఈ కష్టాలు.!

  ఫ్యాన్స్ కోసం చేసిన పని వల్లే ఈ కష్టాలు.!

  మహేశ్ బాబు సర్జరీ చేయించుకునేంది ఆయన మోకాలికి అని సమాచారం. ‘సరిలేరు నీకెవ్వరు' సినిమా కోసం అతడు ఎంతగానో శ్రమించాడు. మరీ ముఖ్యంగా తన ఫ్యాన్స్ తలెత్తుకోవాలనే ఉద్దేశ్యంతో అదిరిపోయే డ్యాన్స్‌లు చేశాడు. కష్ట సాధ్యమైన స్టెప్పులను వేసే క్రమంలోనే మహేశ్ మోకాలిలో నొప్పి మొదలైందని తెలిసింది. అయినప్పటికీ అలాగే షూటింగ్ చేసి సక్సెస్ అయ్యాడు.

  అసలు మొదలైంది ఆ సినిమా అప్పుడే

  అసలు మొదలైంది ఆ సినిమా అప్పుడే

  వాస్తవానికి మహేశ్ బాబుకు గతంలోనూ ఓ సర్జరీ జరిగింది. అది కూడా మోకాలికే. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఆగడు' సినిమా సమయంలో ఫైట్స్ చేస్తూ మహేశ్ గాయపడ్డాడు. అప్పుడు అమెరికాలోనే దానికి సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడదే నొప్పి తిరగబెట్టిందని అంటున్నారు. దీంతో వైద్యుల సూచన మేరకు మహేశ్ సర్జరీకి ఒప్పుకున్నాడనే టాక్ వినిపిస్తోంది.

  Mahesh Babu Emotional Speech At Sarileru Neekevvaru Success Meet
  సర్జరీ వల్ల అది ఆలస్యం.. నిరాశలో ఫ్యాన్స్

  సర్జరీ వల్ల అది ఆలస్యం.. నిరాశలో ఫ్యాన్స్

  ఈ ఏడాది మహేశ్ మరో సినిమాతో వస్తాడని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందబోయే సినిమా ఈ ఏడాదే పూర్తవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే, మహేశ్‌కు ఇప్పుడు సర్జరీ జరగబోతుండడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

  English summary
  Mahesh Babu is an Indian film actor, producer, media personality, and philanthropist known for his works in Telugu cinema. He owns the production house G. Mahesh Babu Entertainment Pvt. Ltd. Mahesh underwent a surgery back then. But still the pain reportedly persists.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X