సినిమాల్లోకి నమ్రత శిరోద్కర్ రీఎంట్రీ.. ఆ హీరో మూవీలో ఊహించని పాత్రలో!

టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమదైన చిత్రాలతో మెప్పించి స్టార్లుగా మారారు. మిగిలిన వారిలో కొందరైతే స్టార్లనే వివాహం చేసుకుని సెటిల్ అయిపోయారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఒకరు. ఆరంభంలోనే అందంతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ పిల్ల.. ఇప్పుడు భర్తకు సపోర్టుగా ఉంటోంది. తద్వారా ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా నమ్రత శిరోద్కర్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందన్న వార్త వైరల్ అవుతోంది. ఆ వివరాలు మీరే చూడండి!

మిస్ ఇండియాగా నమ్రత
మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన నమ్రత శిరోద్కర్ 1993లో జరిగిన అందాల పోటీల్లో 'మిస్ ఇండియా యూనివర్స్', 'మిస్ ఇండియా ఏషియా పసిపిక్'గా ఎంపికై సత్తా చాటుకుంది. ఆ తర్వాత నటన మీద ఉన్న ఆసక్తితో 1998లో 'జబ్ ప్యార్ కిసీసే హోతా హై' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంటరైంది. అనంతరం ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో నటించి సత్తా చాటింది.

Mahesh Babu Wife Namrata Shirodkar Re Entry To Telugu Film Industry

తెలుగులో స్టార్ హీరోలతో
బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న సమయంలోనే నమ్రత శిరోద్కర్.. మహేశ్ బాబు నటించిన 'వంశీ'తో తెలుగులోకి వచ్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్‌ అయింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో 'అంజీ' అనే సినిమానూ చేసింది. ఇది కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. ఫలితంగా నమ్రత తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది.

సూపర్ స్టార్‌తో వివాహం
'వంశీ' మూవీలో నటిస్తోన్న సమయంలోనే మహేశ్‌ బాబుతో నమ్రత లవ్‌లో పడింది. ఆ తర్వాత చాలా కాలం పాటు వీళ్లిద్దరూ సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించారు. అలా దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకున్న తర్వాత పెద్దలను ఒప్పించుకున్నారు. ఈ క్రమంలోనే 2005లో వీళ్లు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.

Mahesh Babu Wife Namrata Shirodkar Re Entry To Telugu Film Industry

మహేశ్‌ బాబుకు సపోర్టు
పెళ్లి జరిగిన తర్వాత నమ్రత శిరోద్కర్ సినిమాకు బ్రేక్ ఇచ్చింది. అయితే, ఆ తర్వాత సినీ రంగంలో ఫుల్ యాక్టివ్ అయిన ఈ భామ.. మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటోంది. ముఖ్యంగా డేట్స్, స్టోరీ డిస్కర్షన్స్, స్టైల్స్, యాడ్స్, బిజినెస్ ఇలా అన్నింటిలోనూ తన మార్క్ చూపిస్తోంది. అలాగే, నిర్మాతగానూ వ్యవహరిస్తోంది.

రీఎంట్రీ ఇస్తుందంటూ
చివరిసారిగా నమ్రత శిరోద్కర్ 2004లో వెండితెరపై కనిపించింది. ఆ తర్వాత ఆమె ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ, సూపర్ స్టార్ వైఫ్ మూవీల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీటిని ఆమె ఖండించింది కూడా. అయితే, నమ్రత నిజంగానే మళ్లీ నటించబోతుందని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్‌గా మారిపోయింది.

Mahesh Babu Wife Namrata Shirodkar Re Entry To Telugu Film Industry

ఆ హీరో సినిమాలో రోల్
ఫిలిం సర్కిళ్లలో ప్రచారం అవుతోన్న సమాచారం ప్రకారం.. నమ్రత శిరోద్కర్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తుందట. ఓ పేరున్న ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరో నటించే సినిమాతో ఆమె మళ్లీ తెరపై కనిపించనుందని అంటున్నారు. ఈ చిత్రంలో ఆమె ఎవరూ ఊహించని విధంగా కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నారట. ఇదే నిజం అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే అనాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X