twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    100% లవ్ డైరెక్టర్ కి మహేష్ ఛాన్స్ ఇస్తాడా..!?

    By Sindhu
    |

    100% లవ్ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన 'ఆర్య" సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయడానికి సన్నాహాల్లో ఉన్నాడు. మహేష్ కోసం సుకుమార్ ఇప్పటికే కథ కూడా సిద్దం చేశాడు. అయితే ఇంతదాకా మహేష్ కి ఆ కథ వినిపించలేదట. త్వరలోనే ప్రిన్స్ ని కలిసి కథ వినిపిస్తానని, అతను తప్పకుండా అంగీకరిస్తాడని సుకుమార్ నమ్మకంగా ఉన్నాడు.

    ఒక వేళ మహేష్ అంగీకరించినట్టయితే ఈ చిత్రం 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ప్రస్తుతం దూకుడు సినిమాని నిర్మిస్తున్నది కూడా వీరే. సుకుమార్ కి ఆల్రెడి ఈ సంస్థ అడ్వాన్స్ కూడా చెల్లించేసింది. నిజానికి సుకుమార్ దర్శకత్వంలో మహేష్ చిత్రం చాలా కాలంగా డిస్కషన్స్ లో ఉంది. గతంలో మహేష్ ని కలిసి సుకుమార్ చర్చలు కూడా జరిపాడు. ఈ కాంబినేషన్ ఎట్టకేలకు ఇప్పుడు వర్కవుట్ అవనుందన్నమాట. ఒక వేళ మహేష్ అంగీకారం కనుక లభిస్తే సుకుమార్ ప్రతిభకి ఈ చిత్రం అసలైన పరీక్ష పెడుతుంది. ఇంతదాకా స్టార్స్ తో సినిమాలు రూపొందించని సుకుమార్ ఒక పెద్ద స్టార్ ని ఎలా హ్యాండిల్ చేయగలడనేది ఆసక్తి రేకెత్తిస్తుంది.

    English summary
    Mahesh Babu with sensational director. Prince Mahesh Babu who is on his toes trying to make up for the time he was not around has reportedly. The buzz is that Mahesh has given a green signal to none other than the talented Sukumar of '100% Love', fame. This will be made under the banner of 14 reels.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X