Kalki 2898 AD: కల్కి 2 లో కృష్ణుడిగా స్టార్ హీరో.. రూ. 2000 కోట్ల కలెక్షన్స్ పక్కా ..
Kalki 2898 AD: 2024లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను క్రియేట్ చేసిన సినిమాలలో కల్కి 2898 ఏడి ఒకటి. ఈ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ - రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో దీనికి సీక్వెల్ గా కల్కి పార్ట్ 2 రాబోతుంది. అయితే ఈ సినిమాలో శ్రీకృష్ణుడు పాత్రలో ఓ స్టార్ హీరో నటించబోతున్నారని టాక్. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఓ లూక్కెయ్యండి.
టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా .. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని లాంటి స్టార్ సెలబ్రిటీలు ప్రధాన పాత్రలో నటించారు. శ్రీ కృష్ణుడి దశావతారంలోని చివరి అవతారం అయినా కల్కి అవతారం ఆధారంగా రూపొందించిన సైన్స్ పిక్షన్ మూవీ ఈ కల్కి 2898 ఏడి. హిందూ పురాణాలను, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేస్తూ ఈ సినిమాని రూపొందించారు.

ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కర్ణుడిగా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ అర్జునుడిగా కనిపించారు. మహాభారతంలోని సందర్భాలను ఆధారం చేసుకుని సినిమా స్టోరీని రూపొందించారు. ఇదిలాఉంటే కృష్ణుడిగా నటించిన కృష్ణకుమార్ ముఖాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూపించనప్పటికీ అతనికి సూపర్ క్రేజ్ రావడమే కాదు.. లార్డ్ కృష్ణ పాత్ర సినిమా హైలెట్స్‌లో ఒకటిగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాత్రకు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ మరో హైలెట్ అని చెప్పొచ్చు.
ఈ సినిమాలో శ్రీకృష్ణుని పాత్ర లో కృష్ణకుమార్ ముఖాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూపించినప్పటికీ అతనికి ఎనలేని క్రేజ్ వచ్చింది. అలాగే కృష్ణ పాత్ర కు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ మరో హైలెట్ అని చెప్పొచ్చు. వాస్తవానికి కల్కి 1 లో ఈ పాత్ర నిడివి తక్కువగా ఉండడంతో శ్రీకృష్ణుని పాత్రను ధరించిన వ్యక్తి ఫేస్ రిలీవ్ చేయలేదు. అయితే అందుకు కూడా ఓ కారణం ఉందట.
కల్కి పార్ట్ 2 లో శ్రీకృష్ణుని పాత్ర కాస్త నిడివి ఎక్కువగా ఉండబోతుందని, ఆ పాత్రలో స్టార్ హీరో ని నటించాలని భావిస్తున్నారట. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు. కల్కి పార్ట్ 2 లో శ్రీకృష్ణ పాత్రలో మహేష్ బాబు కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందుకే మొదటి భాగంలో శ్రీకృష్ణుని ముఖం స్పష్టంగా చూపించలేదని టాలీవుడ్ టాక్.

ఈ వార్త నెట్టింట్లో వైరల్ కావడంతో శ్రీకృష్ణుని క్యారెక్టర్ లో మహేష్ బాబు నటిస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కల్కి సినిమాలో శ్రీకృష్ణ పాత్రలో మహేష్ బాబు నటిస్తే ఎలా ఉంటుందని నాగ్ అశ్విన్ ను అడగగా.. అందుకు ఆయన సమాధానం ఇస్తూ.. కల్కి లో మహేష్ బాబు శ్రీకృష్ణుడిలా నటించి ఉంటే రిలీజ్ కి ముందే పెద్ద హిట్ అయి ఉండేదని అన్నారు.
ఖలేజా సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్ చాలా బాగుందని, దేవుడిలాంటి మనిషి క్యారెక్టర్ లో ఆయన అద్భుతంగా నటించారని చెప్పారు. మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా క్రేజీ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరోవైపు పార్ట్-2లో మహేష్ బాబు నటిస్తే 2000 కోట్లు పక్కాగా క్రాస్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయం పై మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చేంతవరకు ఇలాంటి రూమర్స్ వైరల్ అవుతూనే ఉంటాయి.


Click it and Unblock the Notifications










