పోకిరి లాగా ఓ రేంజ్ లో హిట్ కొట్టాలనే మహేష్ మళ్లీ ఆ దర్శకుడుతోనే...
ఖలేజాతో ఇంకో పోకిరిలాంటి హిట్టొస్తుందని ఆశించిన మహేష్ అభిమానులకి నిరాశే ఎదురైంది. పోకిరి రేంజ్ హిట్ కోసం వారు ఇంకొన్నాళ్లో, ఏళ్లో ఎదురుచూడక తప్పదనిపిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో 'దూకుడు" అనే మరో యాక్షన్ కామెడీ చేస్తున్న మహేష్ ఆ చిత్రంతో ఎంత దూరం దూకుతాడో, ఎంతగా దూసుకెళతాడో తెలీదు. ఇదిలావుంటే 'పోకిరి" సినిమాలో కొత్త మహేష్ ని చూపించి, అతడికి తిరుగులేని ఇమేజ్ తీసుకొచ్చిన పూరి జగన్నాథ్ త్వరలో మహేష్ తో ఒక సినిమా చేయబోతున్నాడు.
పూరితో ఎప్పుడైనా సినిమా చేయడానికి సిద్దంగా ఉంటానని చెప్పిన మహేష్ కోసం పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఒక కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఫ్యామిలీస్ కి, యూత్ కి చేరువైన మహేష్ ని మాసెస్ కి దగ్గరయ్యేలా చేయగలిగింది ఇంతదాకా పూరి జగన్నాథ్ ఒక్కడే. దాంతో పూరితో మరో సినిమా చేస్తే మాస్ ఆడియన్స్ తో వచ్చిన గ్యాప్ ని ఫిల్ చేసుకోవచ్చునని, తద్వారా భారీ హిట్ కొట్టవచ్చునని, మహేష్ ఆశిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్స్ పూర్తి చేసుకుని మహేష్ సినిమా పని మీద పడాలని పూరి కూడా ఎదురు చూస్తున్నాడు. ఇటీవలి కాలంలో జోరు తగ్గిన పూరికి కూడా పోకిరి రేంజ్ హిట్ ఇప్పడు చాలా అవసంర మరి.


Click it and Unblock the Notifications











