బిజినెస్ మ్యాన్ కి సైడ్ అయిపోయిన అభిషేక్...ఆ చాన్స్ మహేష్ కే అంటున్న పూరీ..!?
మహేష్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ నిర్మిస్తున్న 'బిజినెస్ మ్యాన్" షూటింగ్ ముంబాయ్ లో జరుగుతోంది. దూకుడు బిగ్ సక్సెస్ అందుకున్నా మహేష్ గ్యాప్ తీసుకోకుండా, వెంటనే బిజినెస్ మెన్ షూటింగ్ కు హాజరవుతున్నాడు. పూరి జగన్నాథ్ కూడా బిజినెస్ మెన్ ను చాలా త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాడట. వచ్చే సంక్రాంతికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మహేష్ కెరీర్ లోనే ఎప్పుడూ లేనంత ఫాస్ట్ గా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చెయ్యబోతున్నారన్న విషయం తెలిసిందే. అయితే మహేష్ తోనే హిందీలో కూడా చెయ్యాలని పూరి జగన్నాథ్ డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. మొదట అభిషేక్ బచ్చన్ తో ఈ ప్రాజెక్ట్ అనుకున్నారు. కాల్ షీట్స్ ప్రాబ్లమ్స్ తో మహేష్ తోనే హిందీలోకూడా చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలుగు వెర్షన్ కంప్లీట్ అయిన తర్వాత హిందీ వెర్షన్ కి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ స్టార్ట్ అవుతుందని సమాచారం. బిజినెస్ మ్యాన్ తర్వాత మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" జనవరిలో ఆరంభంమౌతుంది. ఆ తర్వాత 100%లవ్ డైరెక్టర్ సుకుమార్ సినిమా వుంటుంది. కాబట్టి ఈ రెండు సినిమాల తర్వాత హిందీ 'బిజినెస్ మ్యాన్" స్టార్ట్ అయ్యే అవకాశాలు వున్నాయి. ఈలోగా మహేష్ హిందీ ఫర్ ఫెక్ట్ గా మాట్లాడేలా ట్రైనింగ్ తీసుకుంటాడని బిజినెస్ మ్యాన్ యూనిట్ సభ్యుల టాక్....
మహేష్‌బాబు, కాజల్, ప్రకాష్ రాజ్, షాయాజి షిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, బండ్ల గణేష్, భరత్ రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, డాన్స్: దినేష్, కో డైరెక్టర్: విజయ ప్రసాద్.


Click it and Unblock the Notifications











