మహేష్-బాలయ్య మల్టీస్టారర్... నిజంగా ఇలాంటివి జరుగుతాయా?
మహేష్ బాబు, బాలయ్య మల్టీస్టారర్ అంటూ పుకార్లు.ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నారట. టాలీవుడ్లో ఇది చాలా రేర్ కాంబినేషన్, ఎవరికీ నమ్మకం లేదు.ఒక వేళ ఈ కాంబినేషన్ కుదిరితే టాలీవుడ్లో సంచలనమ
సినిమా రంగంలో తరచూ రకరకాలు వార్తలు, పుకార్లు వినిపిస్తుంటాయి. కొన్ని పుకార్లు విన్నపుడు ఇలాంటివి జరిగితే జరగొచ్చు అనే ఆలోచన కలుగుతుంది. అయితే కొన్ని వింటే మాత్రం.... అసలు ఇలాంటి జరుగుతాయా? అనే సందేహాలు మొదలవుతాయి.
తాజాగా ఫిల్మ్ నగర్లో ప్రచారంలోకి వచ్చిన ఓ న్యూస్ (పుకారు) విన్నవారంతా ఆశ్చర్యపోతున్నారు. కలలో కూడా ఊహించని కాంబినేషన్ అది. అసలు ఇది జరుగుతుందనే నమ్మకం కూడా చాలా మందికి లేదు. ఇంతకీ ఆ పుకారు ఏమిటంటే..... బాలయ్య బాబు, మహేష్ బాబు మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారట.

తెరపైకి బోయపాటి పేరు
తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను..... మహేష్ బాబు, బాలయ్య బాబు కాంబినేషన్లో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అఫీషియల్ గా మాత్రం ఎలాంటి సమాచారం లేదు.

ఇద్దరికీ కథ చెప్పాడట
బోయపాటి శ్రీను ఈ విషయమై ఇప్పటికే బాలయ్యతో చర్చించారని, ఇటీవలే మహేష్ బాబును కలిసి కథ వినిపించారని అంటున్నారు. అయితే మహేష్ బాబు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? లేదా? అనే విషయంలో సరైన క్లారిటీ లేదు.

అన్నీ ఓకే అయితే వచ్చే ఏడాది జూన్
అటు మహేష్ బాబు, ఇటు బాలయ్య బాబు నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే జూన్ 2018 నుండి సినిమాను మొదలు పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారట బోయపాటి. ప్రస్తుతం మహేష్ బాబు, బాలయ్య వారి వారి సినిమాల్లో బిజీగా ఉన్నారు.

ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా?
నిజంగా ఇది జరిగితే తెలుగు సినిమా పరిశ్రమ తెరపై ఈ రేర్ కాంబినేషన్ సంచలనం అవ్వడం ఖాయం. బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలవ్వడం ఖాయం. ఈ ఊహలన్నీ ఊహించుకోవడానికి బాగానే ఉంటాయి కానీ... నిజంగా ఇలాంటి అద్భుతాలు జరుగుతాయంటారా?


Click it and Unblock the Notifications











