»   » పూరీ మ్యూజిక్ కే మహేష్ బిజెనెస్ మ్యాన్

పూరీ మ్యూజిక్ కే మహేష్ బిజెనెస్ మ్యాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందుతోన్న ది బిజెనెస్ మ్యాన్ చిత్రం ఆడియో రైట్స్ ని పూరీ మ్యూజిక్ సొంతం చేసుకోంది. పూరీ సంగీత్ పేరుతో గతంలో మ్యూజిక్ కంపెనీని పెట్టిన పూరీ బంపర్ ఆఫర్ చిత్రం ఏది మ్యూజికల్ హిట్ ఇవ్వలేకపోయింది.దాంతో పూరీ ఈసారి దాని పేరు మార్చి పూరీ మ్యూజిక్ అని పెట్టి మళ్ళీ మార్కెట్లోకి రావటానకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తను రెమ్యునేషన్ ని పణంగా పెట్టి ది బిజెనెస్ మ్యాన్ చిత్రం ఆడియోని సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు.

మహేష్ సినిమాకు ఓ రేంజి ఆడియో మార్కెట్ ఉంటుంది కాబట్టి తనకు బాగా కలిసి వస్తుందని ఇలా ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ది బిజినెస్ మ్యాన్ చిత్రం త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.స్క్రిప్టు వర్క్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం లొకేషన్స్ ఎంపికలో బిజిగా ఉంది.పూరి జగన్ తన అసెస్టెంట్స్ తో కలసి లొకేషన్స్ ని వెతుకుతున్నారు.ఇక ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేయాలని పూరీ భావిస్తున్నారు.గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు.ఇక ఈ చిత్రం హిందీ వెర్షన్ ని కూడా పూరి రెడీ చేస్తున్నారు.హిందీ వెర్షన్ లో అబిషేక్ బచ్చన్ చేయనున్నారు.

English summary
Puri is trying to change the name to 'Puri Music' before grabbing the audio rights of Mahesh-Puri's 'Businessman'. Puri is said to be cutting down a part of his remuneration to get the audio rights into his kitty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu