twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బిజినెస్ మ్యాన్' విడుదల తేదీ మార్పు

    By Srikanya
    |

    మహేష్ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ విడుదల మొదట జనవరి 11 వ తేదీన చేద్దామనుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే అంటే జనవరి 6న ఈ చిత్రం విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దానికి కారణం ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేద్దామని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. కానీ సంక్రాంతి సీజన్ లో వీరు అనుకున్నన్ని థియేటర్స్ దొరికే వాతావరణం కనపడటం లేదు. సంక్రాంతికి పూల రంగడు, నిప్పు, బాడీగార్డు కూడా ఉన్నాయి. దాంతో ఆ చిత్రాలకు కూడా ధియోటర్ సమస్యలు రాకుండా ఉండేందుకు గానూ బిజినెస్ మ్యాన్ రిలీజ్ డేట్ మారిస్తే బెస్ట్ అనే నిర్ణయంలో ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే అధికారికంగా మాత్రం నిర్మాతలు ప్రకటించలేదు.

    జనవరి 3 వ తేదీన ఈ చిత్రం సెన్సార్ పూర్తవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో మంచి క్రేజ్ సంపాదించుకుని మార్కెట్లో సినిమాపై అంచనాలు పెంచుతోంది.ఈ చిత్రాన్ని ఓవర్ సీస్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్క్రీన్ చేయనున్నారు. ఓవర్ సీస్ లో సెటిలైన తెలుగువారు కాని మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇదే మొట్టమొదటి సబ్ టైటిల్స్ తో వస్తున్న తెలుగు చిత్రం కావటం మరో రికార్డుగా అభివర్ణిస్తున్నారు. దూకుడు చిత్రం ఓవర్ సీస్ మార్కెట్లో చేసిన బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సారి భారి ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ఇక మహేష్ బాబు దూకుడుతో పెరిగిన మార్కెట్ కు అణుగుణంగానే బిజినెస్ మ్యాన్ ఉండబోతోందని చెప్తున్నారు. అందులోనూ గతంలో మహేష్,పూరీ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి మెగా హిట్ ఫిలిం కావటంతో ఈ సినిమాపై మరింత అంచనాలు ఉన్నాయి.కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ముంబై బ్యాక్ డ్రాప్ లో కథ నడవనుంది. ఇక మహేష్ కి తెలుగు సహా తమిళ్‌లోనూ భారీ మార్కెట్‌ ఉంది. ముఖ్యంగా చెన్నైలో లో అతని వీరాభిమానులు ఉన్నారు. ఈ చిత్రాన్ని ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌ పతాకంపై డావెంకట్‌ నిర్మిస్తున్నారు.

    English summary
    The makers of Businessman are planning for an early release of the film on January 6.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X