పవన్ సినిమాలో మహేష్ బాబు గెస్ట్ రోల్?
హైదరాబాద్ : తెలుగు సినిమా ప్రేక్షకులు రాబోయే కాలంలో సరికొత్త కాంబినేషన్లను తెరపై చూడబోతున్నారా? అంటే అవుననే నమ్మకం కలిగిస్తున్నాయి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు. చాలా ఏళ్ల తర్వాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం వెంకటేష్-మహేష్ బాబులతో మల్టీ స్టారర్లుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
త్వరలో మరో సరికొత్త కాంబినేషన్ తెలుగు తెరపై మెరవబోతోందట. ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'సరదా'(తాత్కాలిక టైటిల్) చితంలో మహేష్ బాబు గెస్ట్ రోల్ చేయబోతున్నారని వినికిడి.
ఈ ఇద్దరు స్టార్ హీరోలతో దర్శకుడు త్రివిక్రమ్‌కు మంచి సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో....ఇద్దరినీ మేనేజ్ చేసిన దర్శకుడు 'సరదా' చిత్రంలో మహేష్ బాబుతో అతిథి పాత్ర చేయడానికి ఒప్పించారని చర్చించుకుంటున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంతో త్వరలోనే తేల నుంది. గతంలో పవన్ కళ్యాన్ 'జల్సా' చిత్రానికి మహేష్ బాబు బ్యాగ్రౌండ్ వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
సరదా సినిమా విషయానికొస్తే...
ఈ చిత్రంలో పవన్ సరసన సమంత హీరోయిన్‍గా చేస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందనున్న ఈచిత్రం ప్రతి సీన్ వినోదాత్మకంగా, ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీ, పంచ్ డైలాగులు మేళవించిన తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడు. నటీనటుల వివరాలు, ఇతర సాంకేతిక విభాగం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications











