»   » మరోసారి మహేష్-దిల్ రాజు కాంబినేషన్

మరోసారి మహేష్-దిల్ రాజు కాంబినేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: క్రితం సంక్రాంతికి దిల్ రాజు,మహేష్ కాంబినేషన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం వచ్చి హిట్టైంది. ఈ సంవత్సరం దిల్ రాజు నిర్మించిన ఎవడు చిత్రం సూపర్ హిట్ కొట్టింది. నిజానికి క్రితం సంవత్సరం జూలై లో విడుదల చేద్దామనుకున్న చిత్రం వాయిదాలు పడుతూ పడుతూ సంక్రాంతి సీజన్ లో వచ్చింది. ఇప్పుడు మరోసారి మహేష్, దిల్ రాజు కాంబినేషన్ కి రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దిల్ రాజు సైతం ఖరారు చేసారు.

తమ ఎవడు చిత్రం ప్రమోషన్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేసారు. దిల్ రాజుని మహేష్ బాబు చిత్రంపై కాంపిటేషన్ కోసం ఎవడు వేసారా అంటే సమాధాన మిస్తూ... అది కాంపిటేషన్ ఏ మాత్రం కాదు. మేము సంక్రాంతి సీజన్ మిస్ కాకూడదు అనుకున్నాం. మేము మహేష్ తో ఇప్పటికే ఓ సినిమా చేసి ఉన్నాం..మళ్లీ మరో సినిమా చేయబోతున్నాం అని చెప్పారు.

Mahesh-Dil Raju-Vamsi Combo!!

ఇక మహేష్ తో చేయబోయే దిల్ రాజు చిత్రానికి వంశీ పైడిపల్లి డైరక్టర్ అని తెలిసిందే. వంశీ పైడిపల్లి ఇప్పటికే మహేష్ బాబును కలిసి స్టోరీ వివరించాడు. వంశీ చెప్పిన కథకు మహేష్ బాబు బాగా ఇంప్రెస్ అయి, స్ర్కిప్టును పూర్తి వినోదాత్మకంగా డెవలప్ చేయాలని సూచించాడు.

ఇంతకుముందు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ...' 2014 లో మహేష్ బాబుతో నా తర్వాతి సినిమా ప్రారంభం అవుతుంది' అని వెల్లడించారు. మహేష్ బాబు కోసం ఇప్పటికే స్టోరీ రెడీ చేసుకున్న వంశీ పైడిపల్లి, స్క్రిప్టు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టబోతున్నారు. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్‌గా వైవిద్యమైన కథ, స్ర్కిప్టుతో ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తాడని తెలుస్తోంది. అదే విధంగా మహేష్ బాబు లుక్ కూడా గత సినిమాలకు భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాడు.

English summary

 Rumours are going on about Dil Raju project with Mahesh Babu again. Vamsi Paidipally already expressed his willingness to work with Mahesh Babu and is that true that Mahesh Dil Raju and Vamsi teaming up again?.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu