సమంత ఆశలని అడిఆశలు చేసిన మహేష్ బాబు...!?
మహేష్ బాబుకి మీడియాతో ఎందుకు పడదో కానీ దూకుడు ఆడియో వేడకకి ప్రెస్ ని ఆహ్వానించకుండా ప్రిన్స్ మరోసారి తన బుద్దిని బయటపెట్టుకున్నాడు. ప్రెస్ ఫోటోగ్రాఫర్లు వస్తే స్టిల్స్ కోసం ఇబ్బంది పెట్టేస్తారని, పదేపదే ముందుకొచ్చి ఫోటోలు తీస్తారని ఫంక్షన్ వద్దని మహేస్ అంటూ ఉంటే, ప్రెస్ లేకుండా ఫంక్షన్ కానిచ్చేద్దామని నిర్మాతలు సూచించారట. దాంతో పర్సనల్ ఫోటోగ్రాఫర్ ఒక్కడిని పెట్టుకుని ఫంక్షన్ కానిచ్చేశారు.
దాంతో సహజంగా ఆడియో ఫంక్షన్లంటే వచ్చే వందలాది ఫోటోలు రాలేదు. కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసి పంపితే వాటిని మీడియావాళ్లు పెట్టుకొన్నారని సమాచారం. అయితే ఈ వేడుకలో తనని అంతా హైలైట్ చేస్తారని ఆశించి సమంత తనబొడ్డుని వజ్రంతో డెకరేట్ చేసుకుని వచ్చింది. ఫోటోగ్రాఫర్లు తన మీదే ఫోకస్ ఉంచుతారని ఆమె ఆశిస్తే అసలక్కడ ప్రెస్ ఫోటోగ్రాఫరే కనపడలేదు. తర్వాత సంగతి తెలిసి పాపం మాయలేడి చాలా ఫీలయిందట. ఇంటర్వ్యూలు గట్రా అంటే ఎలాగో ముఖం చాటేస్తాడు ఇక ఇలాంటి వేడుకలకి కూడా ప్రెస్ ని అవాయిడ్ చేస్తే మహేష్ ని వాళ్లు బొత్తిగా లెక్క చేయరేమో కదూ..?


Click it and Unblock the Notifications











