మహేష్ ‘దూకుడు’కు సెన్సార్ కష్టాలు
హీరో మహేష్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా దూకుడు. సెప్టెంబర్ 23న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. అయితే ఈ సినిమాకు ఇప్పడు సెన్సాన్ టెన్షన్ పట్టుకుంది. ఈ సినిమాకు ఈనెల 17న సెన్సార్ చేయడానికి సెన్సార్ బోర్డు సభ్యలు నిర్ణయించారు. అయితే ఆ రోజు వారి చేతికి సినిమా కాపీ అందక పోవడంతో సెన్సారింగ్ ను సోమవారానికి వాయిదా వేశారు. అయితే చెప్పిన సమయానికి తమకు సినిమా కాపీని అందించక పోవడంపై సెన్సార్ బోర్డు చీఫ్ ధనలక్ష్మి దూకుడు దర్శక నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తూంది. ఫస్ట్ కాపీ రెడీ కాకముందే దర్శక నిర్మాతలు..కాపీ రెడీ అయినట్లుగా ల్యాబ్ నుంచి నకిలీ సర్టిఫికెట్ తెచ్చినట్లు గ్రహించిన సెన్సార్ ఛీప్ దర్శకత నిర్మాతలకు చివాట్లు పెట్టినట్లు సమాచారం. సౌండ్ ఎపెక్ట్స్, రీరికార్డింగ్ లేకుండా సినిమా సెన్సార్ చేయడం కుదరదని తేల్చి చెప్పినట్లు తెలిస్తోంది.
దర్శకత నిర్మాతల వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న ఆమె సెన్సార్ కార్య్రకమాన్ని సెప్టెంబర్ 25కు వాయిదా వేసినట్లు తెలిసింది. 23న రిలీజ్ ఉన్న నేపథ్యంలో 25కు సెన్సార్ కార్య్రకమాన్ని వాయిదా వేయడంపై దర్శక నిర్మాతలు ఆందోళనలో ఉన్నారు. అదే జరిగితే సినిమాకు కొంత నష్టం తప్పదు, పైగా అదనపు ఖర్చులు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో సెన్సార్ ఛీప్‌ను మేనేజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆశ్రయించినట్లు ఫిల్మ్ నగర్ టాక్. మరి ఏం జరుగబోతోందో? వెయిట్ అండ్ సీ...


Click it and Unblock the Notifications











