త్వరలో మరో మైల్ స్టోన్ క్రియేట్ చేయనున్న మహేష్ ‘దూకుడు’..!
దర్శకుడు శ్రీనువైట్ల-మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'దూకుడు" వరుస సంచలనాలతో దూసుకుపోతుంది. రికార్డ్ కలెక్షన్లతో ఆంధ్ర నుంచి అమెరికా వరకు ఏ తెలుగు సినిమాకు లేనంత భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తుంది. ఈ వసూళ్లతో నిర్మాతలు కూడా హుషారుగా మరింతగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో ఏ తెలుగుసినిమా సాధించనన్నీ భారీ వసూళ్లు దూకుడుకు వచ్చాయి.
దాంతో దూకుడు నిర్మాతలు ఆఫ్రికాలోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా మన తెలుగు వారు ఉన్నారు కాబట్టి ఏ ఒక్క అవకాసాన్ని జారవిడుచుకోకూడదనే ఆఫ్రికాలో విడుదలచేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దాంతో మహేష్ దూకుడు అతి త్వరలో మరో మైల్ స్టోన్ క్రియేట్ చేయనున్నది. ఆఫ్రికాలో రిలీజ్ అవుతున్న మొదటి తెలుగుసినిమా, సౌత్ ఇండియన్ సినిమా కూడా ఇదే కానుంది. బోత్సవానా, కెన్యాలోని నైరోబీలో 'దూకుడు" రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విడుదల ఎప్పుడన్నది ఇప్పటి వరకూ తెలియలేదు. ఆ వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నది. దూకుడు టాలీవుడ్ ట్రేడ్ పండితులకు కొత్త పాఠాలు నేర్పుతుంది. మరో రెండు వారాల్లో దూకుడు మగధీర కలెక్షన్ల రికార్డ్ వంద కోట్ల మార్క్ ను దాటే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











