పవన్ సినిమాలో మహేష్ బాబు గెస్ట్ రోల్?
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేసన్లో 'అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై ఓ ఆసక్తి కరమైన గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ రోల్‍లో కనిపించనున్నాడని ఆ వార్తల సారాంశం.
గతంలో త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్లో వచ్చిన 'జల్సా' చిత్రం కోసం మహేష్ బాబు బ్యాగ్రౌండ్ వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఆయన గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడనే వార్త సర్వత్రా చర్చనీయాంశం అయింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు మహేష్ బాబు బాగా సన్నిహితుడు కావడంతో ఈ వార్తల్లో ఎంతో కొంత నిజం లేక పోలేదని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7వ తేదీన విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మన్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











