Don't Miss!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- News కడప కోర్టు ఆంక్షలపై హైకోర్టుకు సునీత..! వైసీపీపై కీలక వ్యాఖ్యలు..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
మహేష్ కి దిమ్మతిరిగే రేంజ్ లో ఆఫరిచ్చిన డైరెక్టర్...!?
'త్రీ ఇడియల్స్ రీమేక్ చుట్టూ తిరిగి మళ్లీ ముందు అనుకున్న చోటికే వచ్చి ఆగేట్టుంది. శంకర్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా, తమిళంలో విజయ్ హీరోగా చేద్దామని మొదలు పెట్టిన ఈ చిత్రం నుంచి విజయ్, మహేష్ ఇద్దరూ ఒకేసారి వాకౌట్ చేశారు. దాంతో సూర్యతో ఈ చిత్రాన్ని రెండు భాషల్లోను తీసేద్దామని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. కానీ రెమ్యూనరేషన్ విషయంలో సూర్య పేచీ పెట్టడం, మళ్లీ ఈ చిత్రం చేయడానికి విజయ్ ముందుకు రావడంతో తమిళ త్రీ ఇడియట్స్ 'నాన్ బన్"ముందుకి కదిలింది.
అయితే విజయ్ కి తెలుగులో మార్కెట్ లేదు కాబట్టి ఇప్పుడు తెలుగు వరకు వేరే హీరో ఖచ్చితంగా అవసరమయ్యాడు. దాంతో జెమిని ఫిల్మిం సర్క్యూట్ వారు మళ్లీ మహేష్ బాబు దగ్గరకే వెళ్లి మంతనాలు మొదలు పెట్టారని, కేవలం అరవై రోజుల డేట్స్ ఇస్తే సినిమా చేసేసుకుంటామని అంటూ, మహేష్ కే మతిపోయే రేంజ్ ఆఫరిచ్చారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రిన్స్ నుంచి ఇంకా అవుననీ, కాదనీ బదులు రాలేదని తెలిసింది..