twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్స్ పల్స్ తెలుసుకొన్న మహేష్ బాబు..రూటు మార్చాడు...!

    By Sindhu
    |

    చూడ్డానికి చాక్లెట్ బాయ్ లా కనిపించినా కానీ మహేష్ బాబుని మాస్ క్యారెక్టర్ లో చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడతారని 'పోకిరి" విజయం రుజువు చేసింది. ఆ సినిమా తర్వాత వరుసగా మాస్ సినిమాలు చేసి తన పరిధిని పెంచుకోకుండా మహేష్ క్లాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని కథలు అంగీకరించాడు. 'పోకిరి"తో పెరిగిన అంచనాలతో మహేష్ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ప్లాపయ్యాయి.

    అయితే దూకుడు సినిమాలో కామెడీ చేసి మాస్ ని, ఫ్యామిలీస్ ని, బాగా ఆకట్టుకున్నాడు. మాస్ కి నచ్చే సినిమా చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అర్థం కావడంతో ఇకపై ఎక్కువగా మాస్ క్యారెక్టర్స్ చేయాలని ప్రిన్స్ డిసైడయ్యాడు.జనవరిలో వస్తున్న 'బిజినెస్ మ్యాన్"లో కూడా మాస్ ని మెప్పించే క్యారెక్టర్ పోషిస్తున్నాడు. త్వరలో ఒక పూర్తిస్థాయి మాస్ సినిమా చేసేందుకు బోయపాటి శ్రీనుకి కూడా అవకాశమివ్వాలని మహేష్ బావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

    అలాగే మాస్ సినిమాలకి మకుటం లేని మహారాజు అయిన రాజమౌళితో కూడా మహేష్ రాబోయే రోజుల్లో ఓ సినిమా మొదలు పెట్టే అవకాశాలున్నాయి. సినిమా ఎలా ఉన్న మినిమం గ్యారెంటీ అనిపించుకుంటున్న మాస్ చిత్రాల పట్ల మిగతా హీరోలు కూడా ఇప్పుడు అమితాసక్తి చూపిస్తున్నారు.

    English summary
    If all goes well, Boyapati Srinu might direct Mahesh Babu's next movie which is likely to be rolled out next year. Boyapati Srinu, who is currently working on Jr NTR's 'Dammu' movie (tentatively titled) said that after wrapping up NTR's movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X