తెలుగులో టాప్ స్టార్ మహేష్ అని తేలిందా?
మహేష్ బాబు చిత్రం వచ్చి దాదాపు రెండున్నర ఏళ్ళు అయింది. అలాగే అతిధి, సైనికుడు, అర్జున్ చిత్రాలతో అతను వరస ప్లాపుల్లో ఉన్నారు. అయినా చిత్రమేమిటంటే అతనే తెలుగులో టాప్ స్టార్ అని తేలింది. ఓ ప్రేవెట్ సంస్ధ తెలుగులో తమ ప్రొడక్ట్స్ మార్కెట్ చేసుకోవటానకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకునే నిమిత్తం ఓ ఏజన్సీతో సర్వే నిర్విహించారు. ఆ సర్వేలో అందరినీ ప్రక్కన పెట్టి మహేష్ ముందు వరసలో నిలచాడని తెలుస్తోంది. టెలీకమ్యూనికేషన్స్ రంగంలో అగ్రగామిగా నిలిచిన ఓ సంస్ధ ఈ పనిచేసిందని తెలుస్తోంది. దాంతో వారు మహేష్ ని కలసి తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని కోరారని చెప్తున్నారు. అయితే ఇంకా ఫైనలైజ్ కాలేదని వినపడుతోంది. ఇక ఇప్పటికే మహేష్ ధమ్స్ అప్, యూనివర్సల్, నవరత్న ఆయిల్ కంపెనీలకు అంబాసిడర్ గా చేస్తున్నారు. మరో ప్రక్క త్రివిక్రమ్ చిత్రం చేస్తూ కథలు వింటున్నారు.


Click it and Unblock the Notifications











