మహేష్ నిర్మొహమాటంగా నో చెప్పాడట
హైదరాబాద్: అతిథి చిత్రం రిలీజ్ నుంచి మహేష్ ప్రమోషన్లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సినిమా బాగుంటే ఆడుతుంది..లేకపోతే ఎంత ప్రమోట్ చేసినా ఆడదు అని నమ్మి ప్రమోషన్ లను దూరం పెడుతున్నాడు. ఇంటర్వూలు అవీ కూడా పెద్దగా ఇవ్వటం లేదు. అయితే నేనొక్కిడినే చిత్రం కలెక్షన్స్ మరుసటి రోజు నుంచే డ్రాప్ అవటంతో మీడియా ముందుకు వచ్చి మంచి సినిమా, తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అంటూ ప్రమోట్ చేసారు. అయితే ఫలితం లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో ఆయన ఆగడు చిత్రం ప్రమోషన్ కి రావటానికి ఆసక్తి చూపటంలేదని తెలుస్తోంది.
ఆగడు చిత్రం కలెక్షన్స్ డ్రాప్ అవుతూండటంతో నిర్మాతలు..మహేష్ ని కలిసి...ప్రమేషన్ కు రమ్మని అడిగినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో మహేష్ బాబు చాలా నిర్మహమాటంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అన్ని చోట్లా పూర్తి నెగిటివ్ టాక్ నడుస్తోందని, ఈ పరిస్ధితిల్లో తాను పూనుకుని ప్రమోట్ చేసినా ఫలితం ఉండదని ఆయన చెప్పినట్లు ఫిలిం సర్కిల్స్ లో వినపడుతోంది.

అదే బ్యానర్ నుంచి వచ్చిన 1 నేనొక్కిడనే, ఆగడు రెండు కూడా ఊహించని విధంగా పరాజయం పొందటంతో మహేష్ బాబు చాలా నిరాసగా ఉన్నారని అంటున్నారు. అందుకే ఆయన తన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లి వచ్చి తిరిగి తన పనుల్లో బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. తర్వాత ఆయన కొరటాల శివ తో చిత్రం చేస్తున్నారు. కొరటాల శివ తో చేయబోయే చిత్రం పై బాగా ప్రెషర్ పడనుంది.


Click it and Unblock the Notifications











