మహేష్ ఖలేజా ఆడియో రిలీజ్ డేట్...స్పెషాలిటీ ఏంటి?
మహేష్ బాబు తాజా చిత్రం మహేష్ ఖలేజా ఆడియో పంక్షన్ ఆగస్టు 31న జరపటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.ఆ రోజు మహేష్ బాబు కుమారుడు గౌతమ్ పుట్టిన రోజు కావటంతో దానినే ఆడియో విడుదల తేదీగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఆడియోని సోనీ మ్యూజిక్ వారు విపరీతమైన పోటీలో భారీ మొత్తానికి చేజిక్కిచ్చికొన్నట్లు చెప్తున్నారు. ఇక సోనీ మ్యూజిక్ వారే ఇంతకు ముందు రజనీకాంత్..రోబో చిత్రం ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఇక ఓ పాట మినిహా ఖలేజా షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్ 5 నుంచి 8 వరకూ కంటిన్యూగా ఆ పాట షూటింగ్ పూర్తి చేస్తారు. ఈ చిత్రంలో మహేష్ క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. అనూష్క..హీరోయిన్ గా చేస్తోంది. వేద కూడా ఓ కీలకమైన పాత్ర లోనూ, ప్రకాష్ రాజ్ విలన్ గా చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్, మహేష్ ల మద్య జరిగే క్లైమాక్స్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయంటున్నారు.


Click it and Unblock the Notifications











