twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు పాత్రలో మహేష్ బాబు కనిపిస్తాడా?

    By Srikanya
    |

    మహేష్ బాబు ని ఖైదీ గా చూపెట్టాలని పూరీ జగన్నాధ్ ఆత్రుతపడుతున్నాడుట. ఆ విషయమై మహేష్ తో చర్చించాడని, అయితే మహేష్ ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది.ఇక ఖైదీ రీమేక్ ని రామ్ చరణ్ తో గతంలో చేయాలని పూరీ జగన్ ప్లాన్ చేసారు. కానీ ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు.అప్పటికీ ఖైధీ మీద ప్రేమతో అలీతో ఓ ఎపిసోడ్ ని దేశముదరు చిత్రంలో పూరీ జగన్నాధ్ పెట్టడం జరిగింది.ఇక ఈ రీమేక్ జరిగినా జరగకపోయినా దీని గురించి విన్న వారు మాత్రం...మహేష్ ..చిరంజీవిగా కనపించటం మాత్రం ధ్రిల్లింగ్ అనిపించే అంశం. అలాగే పూరీ టేకింగ్ తో ఇప్పుడు ఖైది రీమేక్ అంటే చాలా బాగుంటుంది. సినిమా ప్రారంభమయితే బాగుండును అంటున్నారు. పూరీ జగన్ ప్రస్తుతం మహేష్ తో ది బిజెనెస్ మ్యాన్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం.. కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేయాలని పూరీ భావిస్తున్నారు.

    గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది. 'బిజినెస్‌మ్యాన్‌'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్‌ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. రీసెంట్ గానే ఈ చిత్రం ఓపినింగ్ జరిగింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    The very idea of seeing Mahesh stepping into the shoes of Chiranjeevi's Khaidi is a thrilling feeling.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X