మహేష్ 'ఖలేజా' ఆడియో రిలీజ్ డేట్ ఎప్పుడంటే...
మహేష్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న మహేష్ ఖలేజా చిత్రం ఆడియో సెప్టెంబర్ 10న రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే సినిమాని సెప్టెంబర్ నెలాఖరున విడుదల చేస్తారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాటల షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. ఒక్క పాట మినిహా చిత్రం మొత్తం పూర్తయింది. అనూష్క ప్రధాన పాత్రలో చేస్తున్న ఈ చిత్రంలో వేద కూడా ఓ కీలకమైన పాత్ర చేస్తోంది. కనకరత్న మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని ఎస్. సత్య రామూర్తి సమర్పిస్తూండగా శింగనమల రమేష్, సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్..క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తారు. ఇక ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, అలీ, నాజర్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, షఫీ, సుశీల్ శర్మ, సుధ, శ్రీరంజని తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: ఎస్. భట్, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్, కళ: ఆనంద్‌సాయి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: త్రివిక్రమ్.


Click it and Unblock the Notifications











