వెరైటీ ప్లాన్ తో ‘మహేష్ ఖలేజా’ ఆడియో రిలీజ్
'మహేష్ ఖలేజా" చిత్ర ఆడియో ఈనెల 27న, సినిమా అక్టోబర్ 7న విడుదల కానున్నట్లు నిర్మాతలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఖలేజా ఆడియోను ఎక్కడ..ఎలా జరపనున్నారనేది ప్రస్తుతం అభిమానుల్లోనూ..ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే పరిశ్రమలో వినపడుతున్న టాక్ ప్రకారం 'ఖలేజా" ఆడియోను వినూత్నంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ ప్లాన్ ప్రకారం..మహేష్ సిటీలోని కొన్ని ముఖ్యమైన ఆడియో షాప్ లకు వెళ్ళి మహేష్ చేతుల మీదుగా ఆడియోను విడుదల చేస్తారు. అయితే నిర్మాతలు మాత్రం పబ్లిసిటీ విషయంలో ప్రయోగాలు వద్దు..ఆడియో పంక్షన్ కూడా ఓ విధంగా పబ్లిసిటీకి సంభందించిందే అని ఒప్పుకోవటం లేదంటున్నారు. అయితే మీడియా వెనక పెట్టుకుని హంగామాగా ఆడియో షాపులకు వెళ్ళి విడుదల చేస్తే మరింత హడావిడి పబ్లిసిటి కదా. ఈ ప్లాన్ అమలు చేస్తారా..లేదా..అనేది తెలియాలంటే..ఈనెల 27 వరకు ఆగాల్సిందే. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











