ఎన్టీఆర్ తో పోటీ ఎందుకని మహేష్ ఆ నిర్ణయం!?
మహేష్ బాబు తాజా చిత్రం ఖలేజా ఇప్పటికే చాలా సార్లు రిలీజ్ డేట్స్ మారుకుంటూ వచ్చింది. అయితే తాజాగా నిర్మాతలు, మహేష్ (ట్విట్టర్)లోనూ ఈ చిత్రం అక్టోబర్ 7న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. అయితే అక్టోబర్ 1వ తేదీన రజనీకాంత్ రోబో చిత్రం రిలీజ్ కావటం, మరో ప్రక్క ఎన్టీఆర్ హీరోగా చేసిన బృందావనం చిత్రం అక్టోబర్ 8న రిలీజ్ డేట్ ప్రకటించటంతో ఇంత పోటీలో రిలీజ్ చేయటం అనవరసమని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది. నిర్మాత శింగనమల రమేష్...ఎలోగో ఇంత ఆలస్యమైంది...మరో వారం ఆగితే నష్టమేమిటని అంటున్నారని చెప్తున్నారు. ధాంతో ఈ రిలీజ్ డేట్ ని అఖ్టోబర్ 14 మార్చుదామని నిర్ణయించుకున్నారు. అయితే మహేష్ జోక్యం చేసుకుని ఎలాగో పండుగ (దసరా) రిలీజ్ మిస్సయినప్పుడు దీపావళికి విడుదల చేయటం బెటరని సూచించినట్లు సమాచారం. అలాగే రోబో, బృందావనం రిజల్ట్ ని బట్టి కూడా అంతకుముందే ఖలేజా రిలీజ్ చేయవచ్చనని చెప్తున్నారు. ఇక దీపావళికి నాగార్జున గగనం రిలీజ్ అవనుంది. మహేష్ ఖలేజా ఆరోజు పెట్టుకుంటే మళ్ళీ గగనం రిలీజ్ డేట్ మారుతుందమో...చూడాలి.


Click it and Unblock the Notifications











