ఆ డేట్ కి మహేష్ 'ఖలేజా' రిలీజ్ డేట్ ఛేంజ్ !?
మహేష్ బాబు తాజా చిత్రం "ఖలేజా" ప్రస్తుతం నాపల్లి కోర్టులో టైటిల్ వివాదంలో ఉందన్న సంగతి తెలిసిందే. ఆ టైటిల్ ని విజయ భాస్కర్ రెడ్డి అనే నిర్మాత రిజర్టర్ చేయించారు. అయితే ఆ రిజిస్టేషన్ ఈ నెల 19 వ తేదీతో ముగిసిపోతుంది. మళ్ళి రెన్యువల్ చేయించకపోతే ఎక్సపైరైపోతుంది. కాబట్టి ఆ రోజు దాకా ఆగి అక్టోబర్ 20 చేస్తే బాగుంటుందని నిర్మాతలకు లాయర్లు, కొందరు సినీ పెద్దలు సూచించినట్లుతెలుస్తోంది. అందుకు నిర్మాతలు ఆలోచనలో పడినట్లు చెప్పుకుంటున్నారు. ఇక విజయభాస్కర రెడ్డి ఎవరూ కూడా తమ టైటిల్ ఖలేజా ని ఉపయోగిస్తే కాపీ రైట్స్ ఉల్లంఘన చట్టం క్రింద పరిగణలోకి తీసుకోవాలని కేసు ఫైల్ చేసారు. ఈ మ్యాటర్ అక్టోబర్ నాలుగవ తేదీన తీర్పుకు రానుంది. ఈ విషయమై శింగనమల రమేష్ మాట్లాడుతూ...1960 లో దొంగ రాముడు అనే చిత్రం వచ్చింది. ఆ తర్వాత దొంగ అనే పదం ని టైటిల్ కు కలుపుకుని ఎన్నో సినిమాలు వచ్చాయి. అంతెందుకు చిరంజీవి దొంగ చిత్రం కూడా వచ్చింది. అంత మాత్రాన ఆ సినిమాలను ఆపుచేయలేదు కదా. అలాగే నా మహేష్ ఖలేజా చిత్రం కూడా. అప్పుడు నేను కాపీ రైట్స్ ని ఉల్లంఘించినట్లు ఎక్కడవుతుంది అని వాదిస్తున్నారు. ఇక బృందావనం రిలీజ్ డేట్ ఇప్పటికే మారి అక్టోబర్ 14 కి వచ్చింది. పైన చెప్పిన లాజిక్ ప్రకారం ఖలేజా కూడా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే అధికారికంగా రిలీజ్ డేట్ ఛేంజ్ విషయమై ఏ ప్రకటనా వెలవడలేదు. అప్పటి వరకూ అక్టోబర్ 7 రిలీజ్ డేట్. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











