‘మహేష్ 21’ శాటిలైట్ రైట్స్ ధర రూ. 11.5 కోట్లు?

By Bojja Kumar

హైదరాబాద్: మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అభిమానులు ఈ చిత్రాన్ని ‘శ్రీమంతుడు' అంటూ పిలుచుకుంటున్నారు. అయితే దర్శకుడు కొరటాల శివ మాత్రం ఇప్పటి వరకు సినిమా టైటిల్ ప్రకటించలేదు. ఆయన మాత్రం ఈ సినిమాను ‘మహేష్ 21' అంటూ పిలుస్తూ వస్తున్నారు. మే 31న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు కొరటాల శివ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసారు. అదే రోజు ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేయనున్నారు.

కాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషక్ష్ం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని ‘జీ తెలుగు' వారు రూ. 11.5 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. మహేష్ బాబు గత సినిమా ‘ఆగడు' చిత్రాన్ని జెమిని టీవీ వారు రూ. 9.75 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి మగాడు' టైటిల్ కే ఓటేసారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ఆ చిత్రం పీఆర్వో, మహేష్ సన్నిహితుడు బి.ఎ రాజు ఖంచించారు. మే 31 న ఫస్ట్ లుక్ లో టైటిల్ ఏమిటన్నది తెలుస్తుందని క్లియర్ చేసారు. 'మగాడు' టైటిల్ మాత్రం కాదన్నారు.

Mahesh-Koratala’s film Satellite rights

ఓవర్సీస్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్, చిత్ర నిర్మాణం పట్ల ఎంతో ఫ్యాషన్ వున్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ (తమ్ముడు), సి.వి.ఎం.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటంతో అభిమానుల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ తొలి చిత్రంగా నిర్మాణవౌతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్, కెమెరా: మది, ఫైట్స్: అనల్‌అరసు, ఆర్ట్: కె.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, నిర్మాతలు: ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కొరటాల శివ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X