మహేష్ నో అంటే నాగార్జునకు టెన్షన్
హైదరాబాద్: మహేష్ బాబు తాను మణిరత్నం దర్శకత్వంలో చేయాలని ఉందంటూ గతంలో చెప్పుకొచ్చారు. అందుకు తగినట్లే ఆ మధ్యన మణిరత్నం ఓ భారీ ప్రాజెక్టుతో ప్రపోజల్ సైతం పెట్టారు. అయితే ఇప్పుడు మణిరత్నం ప్రాజెక్టు బాగా లేటయ్యేలా ఉందని, దానికి నో చెప్పే ఆలోచనలో మహేష్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుపై నాగార్జున సైతం చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆయన పాత్ర ఈ సినిమాలో హైలెట్ గా ఉందని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. అందులోనూ గతంలో నాగార్జున,మణిరత్నం కాంబినేషన్ లో గీతాంజలి చిత్రం వచ్చి మంచి హిట్ అయ్యింది. మళ్లీ అలాంటి మ్యాజిక్ జరుగుతుందనుకుంటే మహేష్ ప్రాజెక్టునుంచి తప్పుకుంటే ఈ ప్రాజెక్టు కాన్సిల్ అవుతుందని నాగార్జున భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతానికి ఈ చిత్రం లైవ్ లో ఉన్నట్లే.... ఈ చిత్రంలో శృతిహాసన్ సెకండ్ హీరోయిన్ గా చేయనుంది. నాగార్జున,ఐశ్వర్యారాయ్ ఇప్పటికే సైన్ చేసారని తెలుస్తోంది. అయితే మహేష్,శృతి హాసన్ ఇంకా ఎగ్రిమెంట్ లోకి రాలేదు. మహేష్ బాబు కొన్ని సూచనలు చేసారని,ఆ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నట్లు వినికిడి. 2014 ఆగస్టు నుంచి ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాసం ఉంది. మద్రాస్ టాకీస్, వైజయింతీ మూవీస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ సినిమా ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో నిర్మితమవుతుంది. చర్చలు చేస్తున్నామని, మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో అన్నారు. నిజానికి, పొన్నియన్ సెల్వన్‌ను కథను తెరకెక్కించాలని మహేష్ బాబు, మణిరత్నం కలిసి అనుకున్నారు. కానీ ఎందువల్లనో అది ఆగిపోయింది. ఇది జరిగి దాదాపు రెండేళ్లవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











