'ఊసరవెల్లి'ని ఎదుర్కోవటానికి మహేష్ అస్త్రం!?
ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవెల్లి దసరా రోజున అంటే రేపు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో దూకుడు హవా తగ్గే ప్రమాదం ఉందని నిర్మాతలు భావించి అందుకు ప్రతిగా మహేష్ అస్త్రం ను ప్రయోగించాలని భావించినట్లు తెలుస్తోంది. ది బిజినెస్ మ్యాన్ లో బిజీగా ఉన్న మహేష్ తో చర్చించిన నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చారు. అందుకోసం మహేష్ ప్రత్యేకంగా మూడు గంటలు పాటు టైమ్ స్పేర్ చేయటానికి ఒప్పుకున్నాడని,అప్పుడు ఇంటర్వూలు, ఎడ్వర్టైజ్మెంట్ లు మహేష్ తో దూకుడు గురించి చెయ్యాలని ప్లాన్ చేసారు. దసరా రోజున టీవీ ఛానెల్స్ లో మహేష్ బాబు కనిపించి దూకుడు గురించి చెపితే బెస్ట్ అని ఈ స్కీమ్ వేసారు.
ఇక ఊసరవెల్లి చిత్రంపై ఎన్టీఆర్ బాగా కాన్పిడెంట్ గా ఉన్నాడు. విజయదశమి తనకు విజయాన్ని అందిస్తుందని సినీ హీరో ఎన్టీఆర్ పేర్కొన్నారు. 'ఊసరవెల్లి" సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దసరా రోజున విడుదలవుతున్న 'ఊసరవెల్లి" సినిమాను ధియేటర్లలోనే చూడాలని ప్రేక్షకులను కోరారు. పైరసీని ప్రోత్సహించవద్దన్నారు. కమర్షియల్ ఇమేజ్‌ను వదలకుండానే, అన్ని రకాల సినిమాలు చేయాలన్నదే తన కోరిక అని ఆయన తెలిపారు. మరి దూకుడు కి ఊసరవెల్లి ఎఫెక్ట్ ఏ మేరకు పడనుందో చూడాలి.


Click it and Unblock the Notifications











