మహేష్, మెహర్ రమేష్ కాంబినేషన్ సెట్ చేసిందెవరంటే...
కంత్రి దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో మహేష్ బాబు చిత్రం కమిటయ్యారనే సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మంచనున్నారని సమాచారం. రీసెంట్ గా డాన్ శీను చిత్రాన్ని ఇదే బ్యానర్ పై నిర్మించారు. అలాగే ఈ చిత్రం వచ్చే సంవత్సరం మెటీరియలైజ్ కానుంది. ఈ మేరకు ఎగ్రిమెంట్స్ జరిగాయని తెలుస్తోంది. మరో ప్రక్క ఈ చిత్రం కోసం కథ రెడీ అవుతోంది. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్..జూ.ఎన్టీఆర్ తో శక్తి చిత్రం రూపొందిస్తున్నారు. మహేష్ బాబు... ఖలేజా చిత్రం పాటల షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
మెహర్ రమేష్ మహేష్ బాబు ఖలేజా ఆర్ ఆర్ మూవీ మేకర్స్ డాన్ శీను ఎన్టీఆర్ శక్తి shakthi meher ramesh khaleja don seenu ntr kantri


Click it and Unblock the Notifications