మహేష్ సినిమాకి 'గోల్కొండ హైస్కూల్'తో పోలిక?
మహేష్, సుకుమార్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సుమంత్ హీరోగా వచ్చిన గోల్కొండ హైస్కూల్ చిత్రాన్ని గుర్తుకు తెస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం...ఈ చిత్రంలో మహేష్ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ గానూ,కాజల్..ఇంగ్లీష్ లెక్చరర్ గానూ కనిపించనుందనే విషయం బయిట వినపడటమే. గోల్కొండ హైస్కూల్ చిత్రంలో సుమంత్...క్రికెట్ కోచ్ గా కనిపిస్తాడు. అలాగే కలర్స్ స్వాతి..ఇంగ్లీష్ టీచర్ గా కనిపిస్తుంది. అయితే అది స్కూల్ బ్యాక్ డ్రాప్..ఇది కాలేజి బ్యాక్ డ్రాప్ అని చెప్తున్నారు.
ఇక మహేష్‌తో గతంలో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆర్య,ఆర్య2,జగడం,హండ్రెడ్ పర్శంట్ లవ్ వంటి చిత్రాలతో టేస్ట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ అవుతోంది. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
యూత్ ఫుల్ రొమాంటిక్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం అభిమానులు కోరుకునే అన్నికమర్షియల్ అంశాలతో తెరకెక్కనుంది. అలాగే గోవా బ్యాక్ డ్రాప్‌తో ఈ చిథ్ర కథ నడుస్తుందని తెలిసింది. అంతే కాకుండా ఇందులో మహేష్ బాబు తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఇందులో లెక్చరర్ పాత్ర చేస్తున్నారని అంటున్నారు.హైదరాబాద్‌లో ఈ నెల 23 నుంచి ఓ పాట చిత్రీకరణతో షూటింగ్ ప్రారంభించి, తదనంతరం థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్ చేయనున్నారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.
అలాగే ఈ చిత్రాన్ని వచ్చే 2013 సంక్రాంతి పండుగకి విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే తొలి సారిగా దేవి శ్రీప్రసాద్ మహేష్ బాబు చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు మరో వైపు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ బాబు సరసన సమంత నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేష్, మహేష్ బాబు, సమంత, అంజలి ప్రధాన పాత్రలుగా మల్టీ స్టారర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











